రాజ్ తరుణ్ కు ఇదేం జబ్బు?

రాజ్ తరుణ్ కు సమస్య వచ్చింది. అతడి బుద్ధి అతడి మాట వినడంలేదు. అతనికి తెలియకుండానే చేతుల పని చేస్తున్నాయి. సామాన్లు దొంగిలించేస్తున్నాయి. ఇదేం జబ్బునో? తప్పదు ఇప్పుడు సినిమాలు అన్నీ కాన్సెప్ట్ ల…

రాజ్ తరుణ్ కు సమస్య వచ్చింది. అతడి బుద్ధి అతడి మాట వినడంలేదు. అతనికి తెలియకుండానే చేతుల పని చేస్తున్నాయి. సామాన్లు దొంగిలించేస్తున్నాయి. ఇదేం జబ్బునో? తప్పదు ఇప్పుడు సినిమాలు అన్నీ కాన్సెప్ట్ ల చుట్టూ తిరుగుతున్నాయి. అందుకే రాజ్ తరుణ్ కోసం ఈ కాన్సెప్ట్ తయారుచేసారు. ఇదంతా ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ రాజ్ తరుణ్ తో నిర్మిస్తున్న రాజు గాడు సినిమా సంగతే.

ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు తనకు తెలియకుండానే దొంగతనం చేసే జబ్బు వుంటుంది. దాంతో అతగాడు తరచు చేతి వాటం ప్రదర్శిస్తుంటాడు. అలాంటి వాడి లైఫ్ ఎలా టర్న్ అయింది. ఏం జరిగిందన్నది సినిమా. అవుట్ అండ్ అవుట్ కామెడీతో రన్ అయ్యే ఈ సినిమాకు సంజనారెడ్డి అనే కొత్త మహిళా దర్శకురాలు రూపొందిస్తున్నారు.

కిట్టూ ఉన్నాడు జాగ్రత్త హిట్ తరువాత రాజ్ తరుణ్ అందిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా కాకుండా, అన్నపూర్ణ బ్యానర్ పై రంగులరాట్నం సినిమా కూడా పూర్తయిపోయి రెడీ గా వుంది. ఈ సినిమాకు కూడా మహిళా దర్శకురాలే పని చేయడం విశేషం.