అయిదు కోట్లు అడిగిన మ్యూజిక్ డైరక్టర్?

ఇవ్వాళ తెలుగునాట టాప్ మ్యూజిక్ డైరక్టర్ గా దేవీశ్రీ ప్రసాద్ అందుకుంటున్నది రెండున్నర కోట్లు. అలాంటిది ఓ మ్యూజిక్ డైరక్టర్ జస్ట్ అయిదు కోట్లు రెమ్యూనిరేషన్ అడిగారట. విషయం ఏమిటంటే, ఓ నిర్మాత వారసుడిగా…

ఇవ్వాళ తెలుగునాట టాప్ మ్యూజిక్ డైరక్టర్ గా దేవీశ్రీ ప్రసాద్ అందుకుంటున్నది రెండున్నర కోట్లు. అలాంటిది ఓ మ్యూజిక్ డైరక్టర్ జస్ట్ అయిదు కోట్లు రెమ్యూనిరేషన్ అడిగారట. విషయం ఏమిటంటే, ఓ నిర్మాత వారసుడిగా తెలుగుతెరపై ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న ఓ హీరో సినిమా కోసం ఓ ప్రముఖ సంగీత దర్శకుడిని అప్రోచ్ అయ్యారట.

ఈ సినిమాకు రీరికార్డింగ్ కీలకం, మీరయితేనే సరిగ్గా సెట్ అవుతుంది. ఈ స్క్రిప్ట్ మిమ్మల్ని డిమాండ్ చేస్తోంది అనే టైపులో చెప్పుకుని వచ్చారట. దాంతో సదరు సంగీత దర్శకుడు అయిదుకోట్లు రెమ్యూనిరేషన్ ఇవ్వండి అయితే… అని అన్నాడట.

దాంతో బిత్తరపోయిన దర్శకుడు ‘అదేంటి సార్.. అలా అడిగారు’ అని అంటే, ‘మీరే చెప్పారు కదా? ఈ స్క్రిప్ట్ నన్ను డిమాండ్ చేస్తోంది, నేను తప్ప వేరు ఎవరూ కుదరదు, నేనే కావాలి’ అంటూ అందుకే అంత మొత్తం అడిగా అన్నారట. దాంతో మరేం మాట్లాడలేక, ఆ దర్శకుడు వెనుదిరిగినట్లు బోగట్టా.

కానీ నిజానికి తనకు ఆ సినిమా చేయడం అంతగా ఇష్టం లేదని, అందుకే అంత మొత్తం అడిగి, రివర్స్ స్ట్రాటజీ వేసానని ఆ సంగీత దర్శకుడు తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు బోగట్టా. మొత్తం మీద భలే టస్సా వేసారన్నమాట. పొరపాటున, అంత మొత్తమూ ఇస్తానని, ఆ సినిమా యూనిట్ ఓకె అని వుంటే, ఈ సంగీత దర్శకుడు ఏం చేసేవారో? ఇష్టం లేని సినిమా డబ్బుల కోసం చేసేవారో? లేదా అప్పుడు మరింకేరమైన ట్విస్ట్ పెట్టి తప్పించుకునేవారో?