మహేష్ నటించిన స్పైడర్ సినిమా కేరళలో కూడా రిలీజైంది. తొలి రోజు ఈ సినిమాకు 85లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. సినిమాకు అక్కడ మంచి టాక్ వచ్చింది. ఇక ఊపందుకుంటుందనే టైమ్ కు దిలీప్ నటించిన రామలీల సినిమా వచ్చింది.
నటుడు దిలీప్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. దాదాపు 2నెలలుగా అతడు జైలులోనే ఉంటున్నాడు. దీంతో అతడు నటించిన రామలీల అనే సినిమా 90శాతం పూర్తయి ఆగిపోయింది. దిలీప్ బయటకొస్తే మిగతా భాగం పూర్తిచేద్దామనుకున్న నిర్మాతలకు నమ్మకం పోయింది. దీంతో ఉన్నంతలో మేకప్ చేసి సినిమాను విడుదల చేశారు.
అలా దిలీప్ నటించిన రామలీల సినిమా థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతం దిలీప్ అనుభవిస్తున్న జైలు జీవితానికి దగ్గరగా ఈ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలు ఉండడంతో మల్లూ ప్రేక్షకులు దీనిపై ఎక్కువ ఫోకస్ పెట్టారు.
రామలీల రిలీజ్ కాకుండా ఉంటే స్పైడర్ కు మంచి స్కోప్ ఉండేది. ఎందుకంటే ప్రస్తుతం మలయాళ బాక్సాఫీస్ లో పెద్ద సినిమాలేం లేవు. ఆ గ్యాప్ ను స్పైడర్ క్యాష్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ రామలీల సినిమా స్పైడర్ కు ఇబ్బందిగా మారింది. అలా జైలు నుంచే మహేష్ కు పోటీగా మారాడు దిలీప్.