కొంతమంది హీరోలకు యాక్షన్ సబ్జెక్ట్ లు క్లిక్ కావు. పైగా నాని, శర్వానంద్, చైతన్య, నితిన్ లాంటి వాళ్లకు యూత్ ఫుల్ ఎంటర్ టైనర్లే బాగా క్లిక్ అవుతాయి. అలా కాకుండా అప్పుడప్పుడు యాక్షన్ థ్రిల్లర్ల వెనకాల పడితే పరాజయాలే ఎక్కువగా పలకరించాయి.
శర్వానంద్ విషయానికి వస్తే, రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి ఫన్ సినిమాలతో హిట్ లు కొట్టాడు. రాబోయే మహానుభావుడు కూడా ఇలాంటి ఫన్ జోనరే. అయితే సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సుధీర్ వర్మ డైరక్షన్ లో చేయబోయే సినిమా అలా కాదని వినికిడి.
స్వామిరారా, దోచేయ్, కేశవ తరహాల్లోనే థ్రిల్లర్ టచ్ తోనే వుంటుంది ఆ సబ్జెక్ట్ అని వినికిడి. ఆర్జీవీకి మాంచి ఫ్యాన్ అయిన సుధీర్ వర్మ అదే స్టయిల్ ను కంటిన్యూ చేస్తూ ఈ స్క్రిప్ట్ కూడా తయారుచేస్తే, అందులో వీలయినంత ఫన్ చేర్చమని శర్వా కోరినట్లు తెలుస్తోంది.
థ్రిల్లర్ లైన్ సంగతి ఎలా వున్నా, సినిమా స్టార్ట్ టు ఎండ్ వరకు ఫన్ మాత్రం మిస్ కాకుండా చూడాలని శర్వానంద్ డైరక్టర్ ను కోరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ అలా మార్చడానికి ఆ స్క్రిప్ట్ లో అవకాశం లేనట్లు వినికిడి. దీంతో శర్వా ఆలోచనలో పడినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. చూడాలి మరి ఏ డెసిషన్ తీసుకుంటాడో?