శ్రీనువైట్లకు ‘మిస్టర్’ ఫైన్

మహా మహా పెద్ద దర్శకులు అనుకునే వారంతా తమ పేరును క్యాష్ చేసుకునే పనిలో పడి, సృజనను, సత్తాను మరిచిపోతున్నారు. దాంతో ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ లాంటి డిజాస్టర్లు వచ్చాయి దర్శకుడు శ్రీను…

మహా మహా పెద్ద దర్శకులు అనుకునే వారంతా తమ పేరును క్యాష్ చేసుకునే పనిలో పడి, సృజనను, సత్తాను మరిచిపోతున్నారు. దాంతో ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ లాంటి డిజాస్టర్లు వచ్చాయి దర్శకుడు శ్రీను వైట్ల నుంచి.

కానీ టాలీవుడ్ లో దర్శకులను బాధ్యులను చేసే ప్రయత్నం జరగడం లేదు. కోట్లకు కోట్లు ఇచ్చేయడం తప్ప. ప్యాకేజీ తో సినిమాలు తయారుచేసి, పైసా వసూల్ లాంటి సినిమాలు తీసి చేతిలో పెట్టే దర్ళకుల చేతి తిరిగి కక్కించే పని ఎక్కడా సరిగ్గా జరిగినట్లు దాఖలాలు లేవు. 

మిస్టర్ సినిమాతో నిర్మాతలకు 15 నుంచి 20కోట్లు లాస్ చేసాడు దర్శకుడు శ్రీనువైట్ల. దీంతో అప్పటి నుంచి పంచాయతీలు నడుస్తూ, ఆఖరికి ఇప్పుడు సెటిల్ అయినట్లు వినికిడి. సుమారు 85లక్షలను శ్రీను వైట్ల నిర్మాతలకు వెనక్కు ఇచ్చేలా ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది.

నిజానికి నష్టంతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. శ్రీనువైట్ల అద్భుతమైన సినిమా తీసి పెడతారని నమ్మితే, ఏకంగా 20కోట్లకు పైగా ఖర్చుచేయించేసారు. పైగా సినిమా పోయింది. 

ఇక మీదట అయినా పెద్ద దర్శకులకు కోట్లకు కోట్లు సమర్పించుకునేటపుడు రిటర్న్ గ్యారంటీ లేదా. సినిమా ఫ్లాప్ అయితే పారితోషికం వెనక్కు ఇచ్చేలా మాట్లాడుకోవడం నిర్మాతలకు కాస్త శ్రేయస్కరంగా వుంటుందేమో?