జై లవకుశ ఇటీవల స్టార్ట్ అయిన భారీ అమ్మకాల ట్రెండ్ లో తొలి సినిమాగా చెప్పుకోవచ్చు. వరల్డ్ వైడ్ గా థియేటర్ హక్కులు దాదాపు 90కోట్ల దగ్గరలో అమ్ముడుపోయాయి. ప్రస్తుతం వున్న సిట్యువేషన్ ప్రకారం ఏ సినిమా అయినా ఫస్ట్ వీక్ లోనే మాగ్జిమమ్ రాబట్టేయాలి. ఎందుకంటే వేరే సినిమాలు రావడం, పైరసీ అన్నది పెద్ద సమస్య. స్మార్ట్ ఫోన్ లు వచ్చి, సినిమాను మొదటి రోజుకే ఫోన్ ల లోకి తెచ్చేస్తున్నాయి.
ఇటీవలి కాలంలో నాన్ బాహుబలి రికార్డుగా వున్న ఖైదీ నెంబర్ 150 వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీక్ లోనే 75కోట్ల వసూలు చేసింది. ఫ్లాప్ అనిపించుకున్న కాటమరాయుడు కూడా 55కోట్ల వరకు ఫస్ట్ వీక్ లోనే వసూలు చేసింది. మరి ఇప్పుడు జై లవకుశ ఏ మేరకు వసూలు చేస్తుందన్నది ఆసక్తికరం.
తొలి రోజు ఫిక్స్ డ్ హైర్ లు అన్నీ కలిపి జైలవకుశ 20కోట్లు వసూలు చేసింది. శుక్రవారం నార్మల్ గా వుంటుంది అనుకున్నా, శని, ఆది వారాలు బాగా వుండే అవకాశం వుంది. అంటే శుక్ర, శని, ఆది వారాలు కలిపి మరో ఇరవై వరకు చేసే అవకాశం వుండొచ్చు. సోమ, మంగళ వారాలు కూడా సెలవులే. బుధవారం నుంచి స్పైడర్ పోటీ స్టార్ట్ అవుతుంది.
అందువల్ల సోమ, మంగళ, బుధ, గురు కలిపితే మరో ఇరవై వసూలుచేయాలి కచ్చితంగా. అంటే అప్పటికి 60కోట్ల వరకు ఫస్ట్ వీక్ వసూళ్లు వస్తాయి. లేదూ ఈ అంచనాలను దాటితే కనుక బయ్యర్లు లక్కీనే. ఫస్ట్ వీక్ చాలా ఏరియాల్లో రెగ్యులర్ థియేటర్లలో అయిదు షోలు, మల్టీ ఫ్లెక్స్ ల్లో ఆరు షో లు పర్మిషన్ తెచ్చుకున్నారు. అందువల్ల ఫస్ట్ వీకెండ్ మంచి ఫిగర్లే నమోదు అయ్యే అవకాశం వుంది.
ఆపైన స్పైడర్ సినిమా టాక్ ను బట్టి వుంటుంది వ్యవహారం. సినిమా ఏరియాల వారీ సంగతి అలా వుంచితే టోటల్ గా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే కనీసం 90కోట్లకు పైగా షేర్ సాధించాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సులువైన టాస్క్ అయితే కాదు. ఫస్ట్ వీక్ కనుక 70కోట్లు షేర్ అనే ఫీట్ సాధించగలిగితే అప్పుడు కొంత అవకాశం వుంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?