ఈ వాట్సప్ జోక్ అదిరిందిగా

వాట్సప్ లో జనాలు భలే హుషారుగా వుంటారు. ఐడియాల మీద ఐడియాలు వదుల్తుంటారు. ఇలా వదలడం భయం, అవి అలా తిరిగేస్తుంటాయి. లేటెస్ట్ గా ఓ జోక్ చలామణీ అవుతోంది. Advertisement ముఖ్య మంత్రి…

వాట్సప్ లో జనాలు భలే హుషారుగా వుంటారు. ఐడియాల మీద ఐడియాలు వదుల్తుంటారు. ఇలా వదలడం భయం, అవి అలా తిరిగేస్తుంటాయి. లేటెస్ట్ గా ఓ జోక్ చలామణీ అవుతోంది.

ముఖ్య మంత్రి చంద్రబాబు బాహుబలి సిరీస్ దర్శకుడు రాజమౌళిని అమరావతి భవనాల డిజైన్ ల కోసం సలహాలు కోరిన సంగతి తెలిసిందే. దీనికి వాట్సప్ లో ఓ సలహా కనిపిస్తోంది.

అమరావతి భవనాలు కట్టాలంటే బాహుబలిలో మాయిష్మతి ని చూపించిన రాజమౌళిని అడగడం వరకు ఓకె. పొరపాటున పాక్ తోనో, చైనాతోనో యుద్ధం వస్తే, ప్రభాస్ ను వెళ్లమని అడగరు కదా? అన్నది ఆ సెటైరికల్ జోక్.

ఇప్పటికే పోలవరం కట్టమని వివి వినాయక్ ను అడగలేదు పాపం, అనే జోక్ తిరిగేసింది. ఇప్పుడు ఈ ప్రభాస్ పేరు లాగుతూ వచ్చినది మరోటి అన్నమాట. అయినా బాహుబలిలో యుద్ధం ప్రభాస్ చేసినా, డైరక్షన్, వ్యూహాలు అన్నీ రాజమౌళివే. అందువల్ల ఆ విధంగా చూస్తే, మళ్లీ రాజమౌళినే సలహాలు అడగాలి యుద్ద వ్యూహాలకైనా.