జై లవకుశలో పొలిటికల్ సెటైర్లు?

జైలవకుశ సినిమా సెన్సారు పూర్తయిన దగ్గర నుంచి జనాల మద్యలో కబుర్లే కబుర్లు. ఎన్ని కబుర్లో. ఈ కబుర్లే చెబుతాయి, ఆ సినిమా మీద జనాల్లో ఎంత ఆసక్తి నెలకొంది అన్నది. సినిమా ఫస్ట్…

జైలవకుశ సినిమా సెన్సారు పూర్తయిన దగ్గర నుంచి జనాల మద్యలో కబుర్లే కబుర్లు. ఎన్ని కబుర్లో. ఈ కబుర్లే చెబుతాయి, ఆ సినిమా మీద జనాల్లో ఎంత ఆసక్తి నెలకొంది అన్నది. సినిమా ఫస్ట్ హాఫ్ ఇలా వుంది. అలా వుంది. సెకెండ్ హాఫ్ ఇలా వుంది. అలా వుంది అంటూ.

ఇవన్నీ ఇలా వుంచితే, ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న గ్యాసిప్ ఏమిటంటే, సినిమాలో ఒకటి రెండు పొలిటికల్ గ్యాసిప్ లు వున్నాయి అన్నది. సినిమాలో ఒకటి రెండు డైలాగులు మ్యూట్ పడ్డాయని కూడా వినిపిస్తోంది. ఒకటి రెండు డైలాగుల్లో పవన్ కు తగిలినవి ఒకటి వుందని కూడా అంటున్నారు.

అయితే సెన్సారు అయిన తరువాత నుంచీ చాలా గ్యాసిప్ లు బయటకు వస్తుంటాయి. వాటిలో కొన్ని నిజాలు వుంటాయి. మరి ఈ పోలిటికల్ సెటైర్లు అన్న పాయింట్ నిజమా, కాదా అన్నది తెలియాలంటే ఒక వారం ఆగాల్సిందే. గ్యాసిప్ వినిపించినట్లు పొలిటికల్ సెటైర్ డైలాగులు ఒకటి రెండు వున్నా, జూనియర్ తెలుగుదేశం పార్టీల మధ్య ఎడం అన్నది అలా క్లియర్ గా వుండిపోయింది, వుండిపోతుంది అని అనుకోవాల్సి వుంటుంది.