స్పైడర్ లో రియాల్టీ షో?

సినిమాల్లో రియాల్టీ షో అంటే దూకుడు సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమా విజయానికి టోటల్ గా ఆ రియాల్టీ షో ఎపిసోడ్ నే బాగా కారణమయిందన్న సంగతీ తెలిసిందే. ఈసారి మహష్ బాబు…

సినిమాల్లో రియాల్టీ షో అంటే దూకుడు సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమా విజయానికి టోటల్ గా ఆ రియాల్టీ షో ఎపిసోడ్ నే బాగా కారణమయిందన్న సంగతీ తెలిసిందే. ఈసారి మహష్ బాబు చేస్తున్న స్పైడర్ లో కూడా చిన్న రియాల్టీ షో బిట్ వుంటదని తెలుస్తోంది.

అయితే దర్శకుడు మురుగదాస్ కదా? ఆ రియాల్టీ షో కూడా ఓ పర్సుస్ ఫుల్ గా వుంటుందని తెలుస్తోంది. శ్రీనువైట్ల దూకుడు సినిమాలో ఆద్యంతం నవ్వులు పూయించడానికి బ్రహ్మానందంతో రియాల్టీ డ్రామా సెట్ చేసాడు. కానీ స్పైడర్ లో అలా కాదట.

సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో విలన్ ను పట్టుకోవడం కోసం హీరో చిన్న రియాల్టీ షో ను ప్లే చేసే ప్రయత్నం చేస్తాడని వినికిడి. టీవీ షో ల పట్ల మహిళలకు వున్న ఆసక్తిని వాడుకుని, మహిళల ద్వారానే పరిశోధన చేయించి, విలన్ ఎక్కడున్నాడో కనిపెట్టే ప్లాన్ హీరో వేస్తాడట.

దాంతో టీవీ షో అనే ఆసక్తితో మహిళలంతా ఈ లైవ్ షో లో పాల్గొని విలన్ ఆచూకి తెలుసుకుంటారు. ఇది ఆద్యంతం సీరియస్ నోట్ తో నడుస్తుంది. ఫన్ గా కాదు. సినిమాలో ఈ సీన్ బాగా వచ్చిందని టాక్ వినిపిస్తోంది.

మహేష్ బాబు ఇంటిలెజెన్స్ అధికారిగా నటిస్తున్న ఈ సినిమా టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. ప్రజలను భయపెట్టి, ప్రభుత్వాలను లొంగదీసుకునే టెర్రరిస్టులను ప్రజల చేతే పట్టించడం అన్నది ఈ బిట్ లో చిన్న కాన్సెప్ట్ అన్నమాట. ఇంటిలిజెన్స్ లో మహిళలే మగవారి కన్నా మిన్న అన్నది మురుగదాస్ ఆలోచన. అందుకే ఆయన ఈ సీన్ పెట్టినట్లు తెలుస్తోంది.