సూళ్లూరు పేటలో బాహుబలి థియేటర్

హీరో ఫ్రభాస్ బాహుబలి సిరీస్ తో ప్రపంచ రికార్డులు సృష్టించాడు. ఇప్పుడు ప్రభాస్ అండ్ యువి క్రియేషన్స్ పార్టనర్స్ అంతా కలిసి సూళ్లూరు పేటలో నిర్మిస్తున్న థియేటర్ కూడా రికార్డులు సృష్టించేలా వుంది. సూళ్లూరు…

హీరో ఫ్రభాస్ బాహుబలి సిరీస్ తో ప్రపంచ రికార్డులు సృష్టించాడు. ఇప్పుడు ప్రభాస్ అండ్ యువి క్రియేషన్స్ పార్టనర్స్ అంతా కలిసి సూళ్లూరు పేటలో నిర్మిస్తున్న థియేటర్ కూడా రికార్డులు సృష్టించేలా వుంది. సూళ్లూరు పేటలో ప్రభాస్ అండ్ కో కలిసి ఓ భారీ మల్టీ ఫ్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ఇది దాదాపు పూర్తి కావస్తోంది. ఒకే చోట పలు థియేటర్లు, గేమ్ ఏరియా, రిఫ్రెష్ మెంట్ ఇలా అన్నీ వుండేలా ప్లాన్ చేసారు. అయితే ఇది కాదు విశేషం.

ఇక్కడ నిర్మిస్తున్న ఓ థియేటర్ కు 106 అడుగుల భారీ స్క్రీన్ వుంటుందట. పైగా త్రీడీ స్క్రీనింగ్ ఫెసిలిటీ వుంటుందట. దేశంలోనే ఇలాంటి థియేటర్ నిర్మించడం ఇదే ప్రథమమట. బాహుబలి హీరో అండ్ కో కలిసి నిర్మిస్తున్న థియేటర్ కూడా బాహుబలి రేంజ్ లోనే అన్నమాట.

థియేటర్ నిర్మాణంలో ఎందరో భాగస్వాములు వున్నా, నెల్లూరు, సూళ్లూరు పేటల్లో ఇది ప్రభాస్ థియేటర్ గానే ఇప్పటికే ప్రాచుర్యంలోకి వచ్చేసింది. నిర్మాణం పూర్తయి, ప్రారంభిస్తే, ఇంకెలా వుంటుందో క్రేజ్.