హీరో డైరక్షన్ లో సుశాంత్ సినిమా

యంగ్ హీరో డైరక్టర్ గా మారుతున్నారు. అక్కినేని మేనల్లుడు సుశాంత్ హీరోగా చేస్తున్నారు. ఈ మేరకు ఓ ప్రాజెక్టు ఫైనల్ అయింది. అలా ఇలా వంటి మంచి సినిమాల్లో నటించిన హీరో రాహుల్ రవీంద్రన్…

యంగ్ హీరో డైరక్టర్ గా మారుతున్నారు. అక్కినేని మేనల్లుడు సుశాంత్ హీరోగా చేస్తున్నారు. ఈ మేరకు ఓ ప్రాజెక్టు ఫైనల్ అయింది. అలా ఇలా వంటి మంచి సినిమాల్లో నటించిన హీరో రాహుల్ రవీంద్రన్ తొలిసారి మెగా ఫోన్ చేతబట్టి డైరక్టర్ గా మారుతున్నారు. ఆయన ఓ మాంచి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. దానికి సుశాంత్ అయితే సూటబుల్ హీరో అనుకున్నారు. అప్రోచ్ అయ్యారు.

తొలిసారి బయట ప్రొడ్యూసర్, తన ప్రాజెక్టు కాకుండా వచ్చిన స్క్రిప్ట్, అది కూడా ఎగ్జయిటింగ్ గా వుండడంతో సుశాంత్ ఎగిరి గంతేసి మరీ ఓకె చేసారు.

ఈ సినిమాకు స్టార్ కాస్ట్ ఎంపిక చేయాల్సి వుంది. కొత్త హీరోయిన్ కావాలి. అక్టోబర్ మూడో వారంలో సినిమాను సెట్ మీదకు తీసుకెళ్తారు. సబ్జెక్ట్ యూత్ ఫుల్ గా, కాంటెంపరరీ గా వుందని కచ్చితంగా తనకు మంచి బ్రేక్ ఇస్తుందని అంటున్నాడు సుశాంత్. పైగా తను బయట సినిమాలు చేయనని అనుకుంటారని, కానీ ఇప్పుడు ఈ సినిమా చేయడం ద్వారా బయట సినిమాలు మరిన్ని చేసే అవకాశం వుందని అన్నాడు సుశాంత్.