కొందరు అంతే. జనాల ట్రెండ్ ను బట్టి కాకుండా, వాళ్లకు నచ్చిన, ఆసక్తి వున్న జోనర్లలోనే సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తారు. అలాంటి డైరక్టర్లలో సుధీర్ వర్మ ఒకరు. ఆయనకు యాక్షన్ థ్రిల్లర్లు అంటే ఇష్టం అన్నట్లు కనిపిస్తుంది. స్వామిరారా, దోచేయ్, ఆపైన రీసెంట్ గా కేశవ సినిమాలు అందిచారు. వీటిలో దోచేయ్ డిజాస్టర్. కేశవ ఓకె అనిపించుకుంది. ఇప్పుడు మళ్లీ మరో సినిమాకు శ్రీకారం చుడుతున్నారు.
హారిక హాసిని అనుబంధ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించే సుధీర్ వర్మ సినిమాకు శర్వానంద్ హీరో. ఈ సినిమా గతంలో కమల్ హాసన్ నటించిన నాయకుడు సినిమా మాదిరిగా వుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా హీరో ఓ సామాన్యుడి నుంచి మాఫియా లీడర్ గా ఎలా ఎదిగాడన్న లైన్ ఆధారంగా వుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ కొంతసేపు నలభై ఏళ్ల వయసున్న మాఫియా లీడర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది.
గతంలో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలో కూడా శర్వానంద్ థర్టీ ప్లస్ వయసులో వున్నట్లు కనిపించాడు. మరి మాఫియా లీడర్ గా ఎలా మెప్పిస్తాడో చూడాలి.