దర్శకుడు రాఘవేంద్రరావు అంటే అయితే భక్తి లేకుంటే రక్తి. ఆయన కొడుకు ప్రకాష్ ది డిఫరెంట్ పాథ్. ముందు ఫాంటసీ ట్రయ్ చేసాడు. ఆ తరువాత డిఫరెంట్ సబ్జెక్ట్ టేకప్ చేసాడు. కానీ రెండుసార్లు పరాజయాలే పలకరించాయి. అందుకే ఈసారి ఫుల్ ఫన్ ఎంటర్ టైనర్ జోనర్ ను ఎంచుకున్నాడు.
శర్వానంద్ హీరోగా కోవెలమూడి ప్రకాష్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో ప్రారంభం కాబోతోంది. సుధీర్ వర్మ-శర్వానంద్ కాంబో సినిమా కన్నా ఇదే ముందు ఫినిష్ కావడానికి ఎక్కువ చాన్స్ లు వున్నాయి. ఈ సినిమా కాస్త హర్రర్, సైకలాజికల్ సబ్జెక్ట్ తో ఫుల్ ఫన్ అండ్ జోష్ తో తయారు చేయాలని ప్రకాష్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారట.
అంటే దర్శకేంద్రుడి కొడుకు తండ్రిలా భక్తి, రక్తిని కాకుండా, భయాన్ని నమ్ముకుంటున్నారన్నమాట. స్క్రిప్ట్ బాగా రావడంతో శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. సినిమా నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుంది.