రజనీ భార్యకు ఇదేం అలవాటో?

రజనీ కాంత్ చూస్తే సూపర్ స్టార్. కోట్ల మందికి ఆరాధ్యుడు. కానీ ఆయన భార్య చూస్తే, కోట్లలో బాకీలు ఎగ్గొట్టే బాపతు. అన్నీ కేసులే. తాజగా వచ్చిన వార్త చూస్తే మరీ ఆశ్చర్యంగా వుంటుంది.…

రజనీ కాంత్ చూస్తే సూపర్ స్టార్. కోట్ల మందికి ఆరాధ్యుడు. కానీ ఆయన భార్య చూస్తే, కోట్లలో బాకీలు ఎగ్గొట్టే బాపతు. అన్నీ కేసులే. తాజగా వచ్చిన వార్త చూస్తే మరీ ఆశ్చర్యంగా వుంటుంది. ఆమె నిర్వహిస్తున్నది ఆశ్రమ్ అనే పాఠశాల భవనానికి గడచిన ఏడెనిమిదేళ్లుగా అద్దే చెల్లించడం లేదట.

ఒకటి కాదు, రెండు కాదు 11కోట్లు బకాయి పెట్టారు. పాపం, ఆ యజమాని కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. కోర్టు బయట సెటిల్ మెంట్ చేసుకుని, అంచెలంచెలుగా చెల్లిస్తామని చెప్పి కూడా ఇవ్వకపోడంతో, భవన యజమాని తాళం వేసేసాడు స్కూలుకు.

అద్దెకు తీసుకున్న భవనానికి అద్దే ఇవ్వని వాళ్లు రేపు రాష్ట్రాన్ని ఏమంత అందంగా పాలిస్తారో ? ఇలాంటి కుటుంబ సభ్యులున్న రజనీ అధికారంలోకి వస్తే, అతి త్వరగా అభాసు పాలు కావడం గ్యారంటీ. రజనీ భార్య, పిల్లల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇప్పటికే అనేక కేసులు, వివాదాలు వున్నాయి. ఇది మరొటి అన్నమాట. తన ఇంటిని, భార్య పిల్లలను సక్రమ మార్గంలో పెట్టలేని రజనీ రేపు రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడని ప్రతి పక్షాలు నిలదీస్తే సమాధానం ఏమిటో?