సినిమా కనుక జనాలకు నచ్చకపోతే సవాలక్ష కారణాలు చెప్పుకోవడమే. ఇండస్ట్రీ ఎలా పాడైపోతోందో? సినిమాను ఎలా బతికించుకోవాలో? నిర్మాతలు సేఫ్ గా వుండడానికి ఏం చేయాలో, ఇలా పాయింట్ టు పాయింట్ డిస్కషన్ చేసుకోవడమే. అదే నిజానికి సినిమా హిట్ అనిపించుకుంటే, ఏ రీజన్ కూడా అప్లై అవ్వదు. మూడు వారాలైనా కూడా ఇంకా థియేటర్లు ఫుల్స్ అవుతుంటాయి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఇదే వర్తిస్తుంది. బాహుబలి కావచ్చు, పెళ్లి చూపులు కావచ్చు, లేటెస్ట్ గా ఫిదా కావచ్చు.
ఫిదా విడుదలై మూడు వారాలయిపోయింది. సినిమా ఇంకా థియేటర్లలోంచి కదలకుండా కూర్చుంది. ఈ వీకెండ్ లో కూడా ఫుల్స్ కావడం విశేషం కాదు. ఈ శుక్రవారం, మూడు భారీ సినిమాలు వున్నపుడు కూడా ఫిదా ఫుల్స్ కావడం కచ్చితంగా విశేషం. ఓవర్ సీస్ లో రెండు మిలియన్లు వసూలు చేసిందీ సినిమా. కేవలం 16 కోట్ల ఖర్చుతో నిర్మించి, రెండు ఏరియాలు మినహా మిగిలిన ఏరియాలు, శాటిలైట్ బిజినెస్ చేసేసి, లాభం చేసుకున్నారు నిర్మాత దిల్ రాజు.
అయినా కూడా ఆయన తన స్వంత పంపిణీకి వుంచుకున్న రెండు ఏరియాలు కూడా మళ్లీ లాభాల పంటపండిస్తున్నాయి. ఈ రెండు ఏరియాల్లో ఒక్క నైజాం ఏరియానే సినిమా నిర్మాణ వ్యయం అంత అంటే దగ్గర దగ్గర 16 కోట్ల షేర్ ను తీసుకువచ్చింది. ఇక ఉత్తరాంధ్ర మరో మూడు కోట్లకు పైగా. అంటే సినిమా మీద లాభం ఎలాగూ వచ్చింది. డిస్ట్రిబ్యూషన్ లో మరో ఇరవై కోట్లు. హిట్ అంటే ఇలా వుండాలి. లక్ అంటే అలా పండాలి.
నైజాం…15.03 కోట్లు
సీడెడ్…3.41 కోట్లు
ఉత్తరాంధ్ర 3.75 కోట్లు
గుంటూరు..2.17 కోట్లు
ఈస్ట్ ..2.06
కృష్ణ..1.93
వెస్ట్…1.44
నెల్లూరు..0.88
రెస్టాఫ్ ఇండియా 1.09
కర్ణాటక..2.70