కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మణికర్ణిక. యుద్ధనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా యూనిట్ లోకి కొత్తగా ఇప్పుడు సోనూ సూద్ చేరాడు. సినిమాలో కీలకమైన సదాశివ అనే వారియర్ పాత్రలో సోనూసూద్ కనిపించబోతున్నాడు. మణికర్నిక టీం ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది.
హిస్టారికల్ క్యారెక్టర్స్ లో నటించిన అనుభవం సోనూ సూద్ కు ఉంది. ఇంతకుముందు జోధా అక్బర్ సినిమాలో ఓ కీలకపాత్ర పోషించాడు. తాజాగా మణికర్ణిక మూవీ కోసం ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాడు సోనూసూద్.
“ఓ నిజజీవిత పాత్రను పోషించడం నిజంగా సవాల్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కు ఓ చరిత్ర ఉంటుంది. ఆ పాత్రను పోషించాలంటే కచ్చితంగా కొన్ని పరిమితులుంటాయి. క్రిష్ లాంటి టాలెంటెడ్ డైరక్టర్ తో పనిచేస్తున్నప్పుడు ఎలాంటి తప్పులు జరగవని నేను గట్టిగా నమ్ముతున్నాను. మంచి అవుట్ పుట్ ఇచ్చేందుకు కష్టపడతాను”. మణికర్ణిక ప్రాజెక్టులో భాగమైన తర్వాత క్రిష్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది.
విజయేంద్రప్రసాద్ కథ అందించిన ఈ సినిమాలో కీలకమైన తాంతియా తోపే పాత్రను అతుల్ కులకర్ణి పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న ఒకేసారి హిందీ, తెలుగు, తమిళ భాషల్లో మణికర్నిక సినిమాను విడుదల చేయబోతున్నారు.