సందీప్ వంగా- స్క్రిప్ట్ స్లో.. షూటింగ్ స్పీడ్

సందీప్ వంగా స్క్రిప్ట్ రాయడానికి చాలా టైమ్ తీసుకుంటారట. దాదాపు ఏడాదిన్నర పట్టిందట యానిమల్ స్క్రిప్ట్ తయారు చేయడానికి. కానీ అదే కనుక ఒక్కసారి షూట్ స్టార్ట్ చేస్తే మాత్రం జెట్ స్పీడ్ లో…

సందీప్ వంగా స్క్రిప్ట్ రాయడానికి చాలా టైమ్ తీసుకుంటారట. దాదాపు ఏడాదిన్నర పట్టిందట యానిమల్ స్క్రిప్ట్ తయారు చేయడానికి. కానీ అదే కనుక ఒక్కసారి షూట్ స్టార్ట్ చేస్తే మాత్రం జెట్ స్పీడ్ లో వెళ్తారట. ఈ విష‌యం సందీప్ వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వెల్లడించారు.

ఆయన గ్రేట్ ఆంధ్రతో మాట్లాడుతూ జస్ట్ వంద రోజులు మాత్రమే షూట్ చేసామని, అంత తక్కువ టైమ్ లో యానిమల్ లాంటి సినిమాను తీయడం ఇంకెవరికైనా అసాధ్యమే అని అన్నారు. సినిమా చూస్తే ఈ విషయం అర్థం అవుతుందన్నారు.  కోవిడ్ టైమ్ లో సినిమా లైన్ అనుకోవడం, రణ్ బీర్ ను తీసుకోవడం జరిగిపోయాయన్నారు. కానీ వన్స్ అక్కడ నుంచి స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయిందని, 18 నెలల సమయం పట్టిందని, సందీప్ చాలా స్లోగా స్క్రిప్ట్ తయారు చేస్తారని, అయితే వన్స్ స్క్రిప్ట్ లాక్ అయ్యాక, చిత్రీకరణ మీద ఇంక ముందు వెనుకలు వుండవని, ఫుల్ క్లారిటీతో వుంటారని అన్నారు. 

స్క్రిప్ట్ తయారీ టైమ్ లో సలహాలు, సందేహాలు అడగడం వుంటుందని, ఇవ్వడం వరకు ఓకె కానీ తీసుకోవడం అన్నది సందీప్ ఇష్టమని అన్నారు. అర్జున్ రెడ్డి టైమ్ లో, అలాగే యానిమల్ టైమ్ లో స్క్రిప్ట్ విషయంలో తన సలహాలు కొన్ని వున్నాయన్నారు. అలా అని తనకు డైరక్టర్ కావాలని లేదన్నారు. అది చాలా కష్టమైన పని అన్నారు ప్రణయ్. ప్రొడెక్షన్ అన్నది పూర్తిగా చూసుకుంటున్నానని చెప్పారు.

యానిమల్ సినిమాలో యాక్షన్ పార్టీ మొత్తం లెక్క వేసుకుంటే 30 నిమిషాలు వుంటుందని, రణ్ బీర్ పాత్ర‌ చిన్న తనం దగ్గర నుంచి ప్రేమ, పెళ్లి మీదుగా వయసు మీద పడే వరకు సినిమా కథ వుంటుందన్నారు. అందుకే కాస్త నిడివి ఎక్కువ అయిందన్నారు. కానీ అలా ప్రేక్షకుడు ఏమీ ఇబ్బంది ఫీల్ కాడని, రెండున్నర గంటల సినిమా మాదిరిగానే ఫీలవుతాడని వివరించారు.

సినిమాకు రెండు వందల కోట్లకు పైగా ఖర్చయిందని, ఎక్కడా అమ్మలేదని, అమ్మడం అన్నది టీ సిరీస్ పాలసీ కాదని, అయిదు వందల కోట్లకు పైగా మార్కెట్ వుంటుందని అంచనా చేస్తున్నామన్నారు. నాన్ థియేటర్ ఆదాయంతో 70 శాతం సినిమా ఖర్చు రికవరీ అయిపోయిందన్నారు.

రాబోయే మూడు సంవత్సరాలు తాను, సందీప్ ఇక ఇక్కడే వుంటామని, ప్రభాస్ సినిమా, ఆ తరువాత బన్నీ సినిమా చేయాల్సి వుందన్నారు. మరో రెండు నెలల్లో ప్రభాస్ సినిమా వర్క్ స్టార్ట్ అవుతుందన్నారు. సెప్టెంబర్ నుంచి సెట్ మీదకు వెళ్తుందన్నారు.