కాంగ్రెస్ వాపా? బలుపా?

కర్ణాటక ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భ్రమ్లలో బ్రతుకుతోందా..? ఆ పార్టీ నాయకులు వాపును చూసి బలుపు అనుకుంటున్నారా..? అంటే ఖచ్చిత అవుననే చెప్పవచ్చు. కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయంతో…

కర్ణాటక ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భ్రమ్లలో బ్రతుకుతోందా..? ఆ పార్టీ నాయకులు వాపును చూసి బలుపు అనుకుంటున్నారా..? అంటే ఖచ్చిత అవుననే చెప్పవచ్చు. కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాలర్లు ఎగరేసుకున్నారు. “ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ” అన్నట్లు అక్కడే పాలన సక్కగ లేక ప్రభుత్వం ఉంటదో, ఊడుతదో అని అంతా అనుకుంటుంటే.. ఇక్కడ మాత్రం ఆ పార్టీ నాయకులు సంకలు గుద్దుకున్నారు. 

ముందు వెనక చూసుకోకుండా స్కాంలు చేసిన వారితో సహా ఎవరు పడితే వారిని పార్టీలో చేర్చుకుంటూ పోయారు. చోటా మోటా నాయకులందరి చేరికతో వచ్చిన “వాపును చూసి బలుపు” అని మురిసిపోయారు.  కాని వాస్తవం మాత్రం మరోలా ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి చూస్తే.. పూర్తిగా ఫెయిల్ అయిన ప్రభుత్వం.. మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల, క్యాష్ ఫర్ ట్రాన్స్‌ఫర్ స్కామ్ లతో పాటు పలు స్కామ్ లు చేస్తు ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇప్పుడు కర్ణాటక పాలన వైఫల్యాలతో పాటు, ఇక్కడ నాయకుల మధ్యన వస్తున్న కుమ్ములాటలతో కాంగ్రెస్ పార్టీ కకావికలమైంది. కాని అధికారంలో తమదే అని ఊదరగొడుతున్న కాంగ్రెస్.. పరిస్థితి పైన పటారం లోన లొటారం లా ఉంది.

సోషల్ మీడియాలో గెలుపుతమదే అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నప్పటికి గ్రౌండ్ లెవల్లో మాత్రం వాస్తవానికి అది పూర్తిగా విరుద్దంగా ఉంది. దీనికి కారణం కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో ప్రచారంలో తేలిపోవడమే.. ఏ నాయకుడు కూడా నియోజకవర్గం దాటి ప్రచారం చేయాలంటే జంకుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి తోడు నవ్వెటొళ్ల ముందు జారిపడ్డట్లు..ఎన్నికల తేది దగ్గర పడే కొద్ది పెయిడ్ సర్వేల ద్వారా కాంగ్రెస్ తమకు అనుకూల సర్వేలతో అధికారం తమదే అని నమ్మించే ప్రయత్నం చేస్తూ ప్రజల్లో నవ్వుల పాలు అవుతోంది. వాస్తవానికి ఎక్కువలో ఎక్కువ 30 కి మించి సీట్లు వచ్చే పరిస్తితి లేదు. వీటికి తోడు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందన్న అంశం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. 

ఇక రేవంత్ రెడ్డి ఒటెద్దు పోకడలు, తిట్ల దండకం కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకుర్చాయి. ఇక రేవంత్ ఓటుకు నోటు కేసు మరకలు కాంగ్రెస్ పార్టీని కూడా  వెంటాడుతున్నాయి. ఆ పార్టీని ఎవరు నమ్మడం లేదు. రేవంత్ తన ప్రాబల్యం  కాపాడుకోవడానికి సీట్లు అమ్ముకోవడం, కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులను ఓడించేందుకు ప్రయత్నించడం ఇవన్ని కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు అసహించుకునేలా చేశాయి. 

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు సర్వ సాధారణం. గల్లీ స్థాయి నుంచి మొదలుకుంటే ఢిల్లీ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం కొట్లాడుకోవడం ప్రజా సమస్యలను పక్కన పెట్టడం వారికి అలవాటే.. ఇపుడు ఆ పార్టీలో కీలక నేతలుగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, కోమటి రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మధు యాష్కీ, జానా రెడ్డి ఒకరి మొహాలు ఒకరు చేసుకోలేని పరిస్థితి ఉంది. వీళ్లందరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఆధిపత్య ధోరణి కొనసాగుతోంది. స్వంత నియోజకవర్గం గురించి పబ్లిక్ గురించి ఏ మాత్రం ఆందోళన లేకుండా ఇలా ఒకరిని మించి ఒకరు కుట్రలకు తెర తీసుకుంటున్నారు. దీంతో ప్రజలను నియోజకవర్గాన్ని గతంలో లాగా గాలికి వదిలేయడం ఖాయమనే భావన ఎక్కువగా ఉంది. 

కర్ణాటకలో కాంగ్రెస్ రైతులకు కేవలం 5 గంటలు మాత్రమే కరెంటు సరఫరా చేస్తోంది. దీంతో ఆ రాష్ట్రంలో చాలీచాలని కరెంటుతో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ మెనిఫోస్టో లో ఇచ్చిన హామీలు కూడా సక్రమంగా అమలు కావడం లేదు.. ఇలా ఆ పార్టీ ఇచ్చిన హామీల అమల్లో కూడా విఫలం చెంది ప్రజల చీత్కారానికి గురవుతోంది. దీంతో అక్కడ వెలగబెట్టింది చాలదు అన్నట్లు తెలంగాణలో ఆ దరిద్రం ఎందుకని ఆలోచిస్తున్నారు ప్రజలు. 

కర్ణాటకలో స్కాములతో తెలంగాణ ప్రజలు ఇక్కడి కాంగ్రెస్ లీడర్ల గత చరిత్రలోకి వెళ్లి ఉలిక్కి పడుతున్నారు. కాంగ్రెస్ లీడర్ల గత చరిత్రను తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఏమున్నది కాంగ్రెస్ చరిత్ర చూస్తే కంపు కొడుతున్నది. కాని వారు మాత్రం పైకి కాంగ్రెస్ దే గెలుపు అన్నట్లు మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తున్నారని ప్రజల అర్థమయింది.