విశాఖ నుంచి పాలన అంటే గొంతులు లేస్తున్నాయ్…!

విశాఖ నుంచి పాలన అంటే విపక్షాలు గొంతులు ఎందుకు లేస్తున్నాయని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. విశాఖతో సహా ఉత్తరాంధ్రా జిల్లాలు బాగుపడే అవకాశం వస్తే మోకాలడ్డడం భావ్యమా అని నిలదీస్తున్నారు. మంత్రి గుడివాడ…

విశాఖ నుంచి పాలన అంటే విపక్షాలు గొంతులు ఎందుకు లేస్తున్నాయని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. విశాఖతో సహా ఉత్తరాంధ్రా జిల్లాలు బాగుపడే అవకాశం వస్తే మోకాలడ్డడం భావ్యమా అని నిలదీస్తున్నారు. మంత్రి గుడివాడ అమరనాధ్ అయితే మీకు ఎందుకు అంత బాధ అని ప్రశ్నిస్తున్నారు.

ఉత్తరంధ్రాలో పుట్టి ఇక్కడే రాజకీయంగా ఉన్నత స్థానానికి చేరుకున్న ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుకు ఎందుకు అంత కక్ష అని ఆయన నిలదీశారు. విశాఖ రాజధాని అంటే నూటికి తొంబై తొమ్మిది శాతం ప్రజలు నో చెబుతారు అని వైజాగ్ అక్టోపస్ గంటా శ్రీనివాసరావు సర్వే నివేదిక వినిపించారు.

విశాఖ రాజధానిగా అయితే పులివెందులగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖను ఇప్పటికే దోచేశారని కూడా గంటా విమర్శించారు. మూడు నెలలల పాలన కోసం ప్రజలను ఎందుకు మభ్యపెడతారు సీఎం గారు అని గంటా మాట్లాడుతున్నారు.

మా విశాఖ అని గంటా అంటూనే విశాఖకు రాజధాని అన్నది ప్రజలకు ఇష్టం లేదని చెబుతున్నారు. ఇదే గంటా 2020 ప్రాంతంలో విశాఖ రాజధానికి అనుకూలంగా మాట్లాడలేదా అని వైసీపీ నేతలు అంటున్నారు అయినా విశాఖ నుంచి పాలిస్తే ఏమి పోయింది అని అడుగుతున్నారు.

అంతా ఒక్క మాట మీదనే నిలబడి విశాఖకు సీఎం రావద్దు అని అంటున్నారు రుషికొండ మీద ఉన్న పర్యాటక భవనాలను అభివృద్ధి చేస్తే అది జగన్ సొంతం కోసం అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వానికి అది ఎప్పటికీ ఆస్తి అన్నది మరచిపోతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. అయినా తాము ఉన్న ప్రాంతానికి సీఎం వచ్చి ప్రజా సమస్యలు చూస్తానంటే అభ్యతరం ఏంటో విపక్షాలు చెప్పలేకపోతున్నాయని అంటున్నారు.