మెగా హీరో.. ముచ్చటగా మూడో ఫ్లాపు

మెగా జూనియర్ హీరో వైష్ణవ్ తేజ్ హ్యాట్రిక్ కంప్లీట్ చేసారు. తొలి సినిమా ఉప్పెన తరువాత చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోయాయి.  Advertisement తొలి సినిమా ఉప్పెన బ్లాక్ బస్టర్. అందులో…

మెగా జూనియర్ హీరో వైష్ణవ్ తేజ్ హ్యాట్రిక్ కంప్లీట్ చేసారు. తొలి సినిమా ఉప్పెన తరువాత చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోయాయి. 

తొలి సినిమా ఉప్పెన బ్లాక్ బస్టర్. అందులో వైష్ణవ్ తేజ్ కంట్రిబ్యూషన్ ఏ మేరకు అన్నది తెలిసిందే. కృతిశెట్టి కంట్రిబ్యూషన్, పాటలు, బుచ్చిబాబు వర్క్ అన్నీ కలిసి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ చేసాయి. ఆ తరువాత నుంచి వైష్ణవ్ తేజ్ కంట్రిబ్యూషన్ ఎలా వుంటుంది అన్నది క్లారిటీ రావడం మొదలైంది.

క్రిష్ చేసిన కొండపొలం సినిమా డిజాస్టర్. రకుల్ లాంటి క్రేజీ హీరోయిన్ తోడు వున్నా కూడా వైష్ణవ్ ఏ మాత్రం పుల్ చేయలేకపోయారు. తరువాత చేసిన రంగరంగ వైభవంగా కూడా డిటో.డిటో.. లేటెస్ట్ సినిమా ఆదికేశవ కూడా పరాజయం దిశగా పయనిస్తోంది. 

సినిమా రన్ ఎలా వుంటుంది అన్న సంగతి పక్కన పెడితే, వైష్ణవ్ తేజ్ నటన మీద ఎక్కువ విమర్శలు వినిపిస్తున్నాయి. ఉప్పెన తరువాత ప్రతి సినిమాలోనూ వైష్ణవ్ నటన నానాటికీ తగ్గుతోంది కానీ పెరగడం లేదు.

ఆదికేశవ సినిమాలో పాత్ర వైష్ణవ్ కు మోయలేని బరువు. కానీ మోసే ప్రయత్నం కూడా కనిపించలేదనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఏ తరహా సీన్ అయినా ఎక్స్ ప్రెషన్ ఒక్కలాగే వుందన్నది ఆడియన్స్ కామెంట్.

ప్రస్తుతం వైష్ణవ్ చేతిలో సినిమా ఏదీ లేదు. ఒకరిద్దరు నిర్మాతలకు ఫోన్ లు చేసి ప్రాజెక్ట్ వుంటే చేస్తారు హీరో అని వైష్ణవ్ టీమ్ అడిగినట్లు తెలుస్తోంది. కానీ పాజిటివ్ గా రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది.