తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. ఎవరు గెలుస్తారోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొని ఉండగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం డిపెన్స్ లో పడిపోయింది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి వచ్చిన పలువురి నాయకుల చేరిక ఇప్పుడు ఆ పార్టీకి టెన్షన్ తెచ్చిపెడుతుంది. ఆ నేతలు స్వతహాగా వచ్చారా లేదా వారిని ఎవరైనా పంపారా ? ఇప్పటికే రెండు మూడు సార్లు పార్టీలు మారిన నాయకులు రేపు పొద్దున గెలిచాక మళ్ళీ పార్టీ మారకుండా ఉంటారా? అన్నది కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది.
కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్లు.. ఇతర పార్టీల్లో వెలివేయబడ్డ వారిని, ఎలాంటి ప్రజా మద్దతు లేని నాయకులను చేర్చుకోవడంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అత్యుత్సాహం చూపించారు. వారు ఇచ్చే డబ్బుకు ఆశ పడిన రేవంత్ ఎవర్ని పడితే వారిని చేర్చుకుని ఏఐసీసీ అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టించాడు. కానీ పార్టీలో చేరిన నేతల విశ్వసనీయత ఎంత? వారు ఎక్కడి నుంచి వచ్చారు? అనే విషయాలు పరిగణనలోకి తీసుకోలేదు.
రేవంత్ రెడ్డిని నమ్ముకున్న పాపానికి 25 నుంచి 30 మంది బీఆర్ఎస్ మద్దతుదారులకు టిక్కెట్లు ఇచ్చామన్న సంగతి ఏఐసీసీ అధిష్ఠానం చాలా లేటుగా గ్రహించింది. కేసీఆర్ కు సన్నిహితులు, బీఆర్ఎస్ మద్దతుదారులయినటు వంటి నాయకులకు టిక్కెట్లు ఇచ్చామని ఇప్పుడిప్పుడే తెలుసుకుంది.
ఒకవేళ వాళ్ళు గెలిచాక బీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశముందని తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్టానం వారు ఎవరో గుర్తించే పనిలో పడింది. ఎన్నికలకు ఇంకా వారం రోజులు కూడా లేదు దీంతో ఏం చేయాలో అర్ధం కాక తలలు పట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఈ పరిణామాలతో ఒక్కసారిగా కాంగ్రెస్ డిపెన్స్ లో పడిపోయింది. ఇది రానున్న రోజుల్లో ఆ పార్టీని మరింత డ్యామెజ్ చేయడం ఖాయం.
రాజకీయ విశ్లేషకులు సీఎం కేసీఆర్ ను అపర చాణక్యుడిగా పేర్కొంటారు. ఇపుడు కాంగ్రెస్ కు తగిలిన షాక్ చూస్తే అది నిజమని మరోసారి రుజువయింది. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న కేసీఆర్.. పైనల్ పంచ్ కి కాంగ్రెస్ కి దిమ్మతిరిగిపోయింది. కాంగ్రెస్ ను వారి చేత్తో వారి తలలే పగలగొట్టుకునేలా ఊహించని షాక్ ఇవ్వడంతో ప్రతిపక్షాలు దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లిపోయాయి.