కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన క్రేజీ హీరోయిన్

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది శ్రీలీల. ఆమె ఇప్పటివరకు లవ్ లో పడలేదంట, ఎవ్వరితో ప్రస్తుతం డేటింగ్ లో కూడా లేదంట. నిజమే.. ఆమెకు ప్రేమించేంత టైమ్ ఇప్పుడు లేదు.…

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది శ్రీలీల. ఆమె ఇప్పటివరకు లవ్ లో పడలేదంట, ఎవ్వరితో ప్రస్తుతం డేటింగ్ లో కూడా లేదంట. నిజమే.. ఆమెకు ప్రేమించేంత టైమ్ ఇప్పుడు లేదు.

అయితే తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో ఓ ఐడియా ఉందంటోది శ్రీలీల. మరీ ముఖ్యంగా తనకు కాబోయే వాడిలో 3 క్వాలిటీస్ మస్ట్ గా ఉండాలంటోంది. ఆ క్వాలిటీస్ ఉన్న కుర్రాడ్నే తను ఇష్టపడతానని చెబుతోంది.

“మొదటి క్వాలిటీ ఏంటంటే, నన్ను పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి చాలా గట్స్ కావాలి. ఎందుకంటే నా లిస్ట్ చాలా పెద్దది. రెండో క్వాలిఫికేషన్ ఏంటంటే, నా కాబోయే భర్తకు మంచి హాస్య చతురత ఉండాలి. మూడో క్వాలిటీ ఏంటంటే, నాకు కాబోయే భర్త కాస్త ఫ్యామిలీ టైపులో అందంగా, పద్ధతిగా ఉండాలి.”

ఇలా తనకు కాబోయే భర్త  ఎలా ఉండాలో వివరించింది శ్రీలీల. మొన్నటివరకు భగవంత్ కేసరి ప్రమోషన్స్ తో మీడియాలో కనిపించిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఆదికేశవ్ ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకొచ్చింది. ఈ సినిమాకు ప్రధాన ప్రచారాస్త్రం శ్రీలీలే.