అసెంబ్లీ తీర్మానమా..? ఆస్తుల అమ్మకమా..?

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కార్మిక సంఘాల నేతలకు హామీ ఇచ్చారు సీఎం జగన్. అసలు వార్త ఇది.. అయితే ఇందులో కొసరు వార్తను పట్టుకుని బాబు అనుకూల…

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కార్మిక సంఘాల నేతలకు హామీ ఇచ్చారు సీఎం జగన్. అసలు వార్త ఇది.. అయితే ఇందులో కొసరు వార్తను పట్టుకుని బాబు అనుకూల మీడియా రచ్చ రచ్చ చేస్తోంది. 

స్టీల్ ప్లాంట్ కి చెందిన 7వేల ఎకరాలను తెగనమ్మి అప్పుల్లో నుంచి బయటపడాలని జగన్ కార్మిక సంఘాలకు సూచించారని, అప్పుల కోసం ఆస్తులమ్ముకోవాలని సలహా ఇచ్చారని తెల్లారే సరికల్లా కథనాలు వండి వార్చారు. అసెంబ్లీ తీర్మానాన్ని పక్కనపెట్టేసి 7వేల ఎకరాల అమ్మకంపై దుష్ప్రచారం మొదలు పెట్టారు.

అసలు జగన్ చెప్పిందేంటి..?

వాస్తవానికి స్టీల్ ప్లాంట్ కి సంబంధించి 7వేల ఎకరాల భూమి నిరుపయోగంగా ఉందని కార్మిక సంఘాలు చెప్పడంతో సీఎం జగన్ దాని అమ్మకంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలనే విషయాన్ని ప్రస్తావించారు. అప్పుల్ని తీర్చుకునేందుకు దాన్ని ఓ ప్రత్యామ్నాయంగా చూడాలన్నారు. అదే సమయంలో సొంత గనులు సమకూర్చే అంశాన్ని పరిశీలంచాలని కేంద్రానికి లేఖ రాసినట్టు కూడా చెప్పారు.

కార్మిక సంఘాలతో సీఎం జగన్ భేటీలో ప్రధానాంశం మాత్రం అసెంబ్లీ తీర్మానమే. అయితే తీర్మానం మాట పక్కనపెట్టేసి, విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులమ్ముకోవాలని జగన్ చెప్పినట్టు రాద్ధాంతం చేస్తోంది టీడీపీ మీడియా.

అసెంబ్లీలో తీర్మానం చేస్తామనడం ద్వారా.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం కాకుండా ఆపాలనే విషయంపై తన చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకున్నారు సీఎం జగన్. దమ్ముంటే అసెంబ్లీ తీర్మానం చేయండి అంటూ సవాల్ విసిరిన టీడీపీ నాయకులు జగన్ నిర్ణయంతో అవాక్కయ్యారు. ఉక్కు ఉద్యమాన్ని హైజాక్ చేయాలనకుంటున్న తమ పాచిక పారదేమోనని భయపడుతున్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం తెరపైకి రాగానే.. హడావిడిగా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుని ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబెట్టారు చంద్రబాబు. అచ్చెన్నాయుడు, తర్వాత లోకేష్, చివరాఖరికి నిమ్మరసం ఇచ్చేందుకు చంద్రబాబు.. ఇలా ఎపిసోడ్ ప్లాన్ చేసుకున్నారు. చివర్లో చంద్రబాబు వస్తున్నారనగా పల్లాని ఆస్పత్రికి తరలించడంతో క్లైమాక్స్ ఎపిసోడ్ రక్తి కట్టలేదు. ఈ నేపథ్యంలో రాజీనామా సవాళ్లు కూడా విసిరి నవ్వులపాలయ్యారు బాబు.

తీరా ఇప్పుడు ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానానికి సిద్ధపడే సరికి బాబు ప్రేక్షక పాత్రకు పరిమితం కావాల్సి వస్తోంది. దీంతో మరింతగా రగిలిపోతున్న బాబు, తన అనుకూల మీడియా ద్వారా స్టీల్ ప్లాంట్ ఆస్తుల అమ్మకం అంటూ దుష్ప్రచారం మొదలు పెట్టారు. 

ఎవరి సత్తా ఏమిటో తెలిసే రోజులొస్తున్నాయ్

చంద్రబాబుకు బుర్ర‌ చెడినట్టుంది