బాలకృష్ణ పొలిటికల్ రిటైర్ మెంట్?

హిందూపూర్ ఎమ్మెల్యేగా ఒక పక్క, క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా మరోపక్క, హీరోగా ఇంకో పక్క మల్టీ టాస్క్ చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. రెండు సినిమాలు చేతిలో వున్నాయి. ఆయన చేస్తాను అంటే రెడీగా…

హిందూపూర్ ఎమ్మెల్యేగా ఒక పక్క, క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా మరోపక్క, హీరోగా ఇంకో పక్క మల్టీ టాస్క్ చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. రెండు సినిమాలు చేతిలో వున్నాయి. ఆయన చేస్తాను అంటే రెడీగా నిర్మాతలు వున్నారు. దర్శకులు వున్నారు. 

ఇవన్నీ ఇలా వుంచితే కొడుకును హీరోగా తీసుకువచ్చి, నిలబెట్టాల్సిన తండ్రి బాధ్యత వుండనే వుంది. ఇలాంటి నేపథ్యంలో మరోసారి హిందూపూర్ లో పోటీ చేస్తారా? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇకపై బాలకృష్ణ రాజకీయాల్లో యాక్టివ్ గా వుండకపోవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే గత నెల రోజులు పైగానే బాలకృష్ణ రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన తరువాత పార్టీ ఆఫీసుల్లో రెండుసార్లు, జైలు దగ్గర ఒకసారి బాలకృష్ణ యాక్టివ్ గా కనిపించారు. ఆ తరువాత మరి ఆంధ్ర వైపే వెళ్లలేదు. 

బాలకృష్ణను అటు రానక్కరలేదని అల్లుడో, బావో చెప్పేసారని గుసగుసలు వినిపించాయి. అవెంతవరకు నిజమో తెలియదు కానీ బాలకృష్ణ అయితే భగవంత్ కేసరి తరువాత కాస్త ఖాళీ దొరికినా అటు వెళ్ల లేదు. చంద్రబాబు జైలు నుంచి వచ్చిన తరువాత కలిసి కాళ్లకు దండం పెట్టారు. అక్కడితో సరి.

ఈ సంగతి ఇలా వుంచితే, ఎన్నికల హడావుడి మెల్లగా అలుముకుంటోంది. ఎంత కేక్ వాక్ అనుకున్నా కూడా హిందూపూర్ మీద కన్నేసి, తన వ్యవహారాలు చక్కబెట్టుకోవాల్సి వుంది. కానీ వార్తల్లో చూస్తుంటే హిందూపూర్‌కు బాలయ్య ఎప్పుడు వెళ్లారన్నదే కనిపించడం లేదు. 

తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా, రాకున్నా బాలకృష్ణకు పోయేది ఏమీ లేదు. గత అయిదేళ్ల కేసీఆర్/జగన్ ప్రభుత్వాల్లో కూడా బాలకృష్ణ ఏమీ ఇబ్బంది పడలేదు. అందువల్ల ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా వచ్చిన ఫరక్ లేదు. కానీ పోటీ చేసే ఉద్దేశం వుంటే మాత్రం ఇప్పటి నుంచి నియోజకవర్గం మీద దృష్టి పెట్టాల్సి అయితే వుంది.

అందువల్ల పొలిటికల్‌గా రిటైర్ మెంట్ ఆలోచనలు ఏమైనా బాలకృష్ణ చేస్తున్నారా? అన్న గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.