సంక్రాంతి బ్లాక్ బస్టర్ కు సీక్వెల్

ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది హనుమాన్ సినిమా. అన్ని వర్గాల నుంచి ఏకగ్రీవంగా హిట్ టాక్ తెచ్చుకున్న ఏకైక చిత్రం ఇదే. ఈ సినిమా చివర్లో సీక్వెల్ ప్రకటించిన సంగతి…

ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది హనుమాన్ సినిమా. అన్ని వర్గాల నుంచి ఏకగ్రీవంగా హిట్ టాక్ తెచ్చుకున్న ఏకైక చిత్రం ఇదే. ఈ సినిమా చివర్లో సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 'జై హనుమాన్' అనే టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేశారు.

ఇప్పుడీ సీక్వెల్ పనులు మొదలయ్యాయి. జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టినట్టు దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా జై హనుమాన్ పనులు మొదలుపెట్టినట్టు తెలిపాడు.

ప్రస్తుతం థియేటర్లలో హను-మాన్ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అంతలోనే జై హనుమాన్ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. సీక్వెల్ లో హనుమంతు (తేజ సజ్జ) పాత్ర ఉంటుంది కానీ హీరో మాత్రం అతడు కాదని తెలిపిన ప్రశాంత్.. ఏకంగా హనుమాన్ నే హీరోగా పెట్టి జై హనుమాన్ తీయబోతున్నట్టు తెలిపాడు.

హను-మాన్ సినిమాకు పదింతల బడ్జెట్ తో జై హనుమాన్ వస్తుందని తెలిపిన దర్శకుడు.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ – పీవీయూసీ లో ఇది కేవలం ఆరంభం మాత్రమేనని తెలిపాడు.

మరోవైపు ఉత్తరాదిన హను-మాన్ ప్రభంజనం కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఈరోజు శెలవు దినం కావడం, మరోవైపు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం కావడంతో.. దాదాపు అన్ని థియేటర్లలో హౌజ్ ఫుల్ షోలు నడిచాయి.