తెలంగాణ అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ వాడివేడిగా సాగుతోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణకు అన్యాయం చేసింది మీరంటే మీరని పరస్పరం విమర్శలు చేసుకుంటుండడం గమనార్హం. ఈ సందర్భంగా ఆగ్రహావేశాలు హద్దులు దాటాయి.
చెప్పుతో కొట్టినట్టు అనే కామెంట్ తెలంగాణ అసెంబ్లీలో దుమారం రేపింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆ కామెంట్‌కు అంతే స్థాయిలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్‌రావు దీటుగా కౌంటర్ ఇవ్వడం గమనార్హం. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే అని హరీష్ పట్టుపట్టారు.
అసలేం జరిగిందంటే.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టు ప్రాజెక్టుల జరుగుతున్న చర్చలో భాగంగా నల్లగొండ ప్రజానీకం బీఆర్ఎస్ను చెప్పుతో కొట్టినట్టు తీర్పు ఇచ్చారని ఘాటు విమర్శ చేశారు. రెండు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో నల్లగొండలో బీఆర్ఎస్ ప్రభావం చూపకపోవడంపై కోమటిరెడ్డి ఆ వ్యాఖ్య చేశారు. బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని నల్లగొండలో సభ పెడతారని ఆయన ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాకు చెందిన వెంకటరెడ్డి ముందు తన ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి హరీష్‌రావు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఆమేథిలో రాహుల్‌గాంధీని చెప్పుతో కొట్టారని తాము కూడా అనగలమని దెప్పి పొడిచారు. కోమటిరెడ్డి ప్రయోగించిన అన్‌పార్లమెంటరీ పదమైన చెప్పుతొ కొడతామనే దాన్ని అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరడం గమనార్హం. ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా తనను ప్యాకేజీ స్టార్ అనే వైసీపీ నేతలను చెప్పుతో కొడ్తానంటూ జనసేనాని పవన్‌కల్యాణ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో చెప్పుతో కొట్టడం లాంటి అగౌరవ పదాలు దొర్లడం చర్చనీయాంశమైంది.