ప్రతి రోజు పండగే, ట్యాక్సీ వాలా, బేబి వంటి బ్లాక్ బస్టర్, కల్ట్ సినిమాలతో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు ఎస్ కేఎన్. ఆయన తన స్నేహితుడు, డైరెక్టర్ మారుతితో కలిసి మణికందన్, శ్రీగౌరి ప్రియ, కన్నరవి లీడ్ రోల్స్ లో నటించిన తమిళ మూవీ లవర్ ను “ట్రూ లవర్” పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ సినిమాను విభిన్న ప్రేమ కథతో దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. “ట్రూ లవర్” సినిమాను ఈ నెల 10వ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాకు సినిమాలోని హైలైట్స్ తెలిపారు నిర్మాత ఎస్ కేఎన్.
మాది చిన్న సినిమా. చిన్న రిలీజ్. ఈగిల్ తో పోటీ పడే పెద్ద సినిమా కాదు. అయినా హంబుల్ గా అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న నిర్ణయాన్ని తీసుకుని ఈ నెల 10న ట్రూలవర్ రిలీజ్ చేస్తున్నాం. రాజా సాబ్ సినిమాను మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఆ టీమ్ లో నేనూ ఉన్నాను. ఆ సంస్థ మా ఫ్రెండ్లీ బ్యానర్ లాంటిదే.
ఒక ఫ్రెండ్ ద్వారా “ట్రూ లవర్” సినిమా మా దృష్టికి వచ్చింది. మూవీ నచ్చింది. దాంతో తెలుగులో చేద్దామని నిర్ణయించాం. ట్రూలవర్ ను మా ప్రీవియస్ మూవీ బేబితో పోల్చలేం. రెండు వేర్వేరు తరహా మూవీస్. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు తమతో పోల్చుకుంటారు.
ప్రేమలో ఉన్న యువతకు రీచ్ అయ్యే సబ్జెక్ట్ ఇది. లవర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సినిమాలో దర్శకుడు చూపించాడు. ఏ రిలేషన్ లోనైనా నమ్మకం అనేది పునాదిగా ఉంటుంది. ఉండాలి. “ట్రూ లవర్” సినిమాలో మెయిన్ పాయింట్ అదే. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చాలా స్ట్రైకింగ్ గా అనిపించాయి.
ప్రస్తుతం ప్లాన్ చేస్తున్న నాలుగు సినిమాల్లో మూడు యూత్ ఫుల్ మూవీస్ ఉంటాయి. ఒకటి సైన్స్ ఫిక్షన్ తో ఔటాఫ్ ది బాక్స్ గా ఉంటుంది అన్నారు ఎస్కేఎన్.