గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తీవ్రంగా దూషించిన తెలుగుదేశం నేతలు చాలా మందే ఉన్నారు! గతంలోనే కాదు.. రేపు పొత్తు గనుక క్యాన్సిల్ అనే వార్త వస్తే పవన్ ను తెలుగుదేశం వాళ్లు ఒక ఆట ఆడుకుంటారు! తనకు పరిటాల రవి గుండు కొట్టించాడంటూ ప్రచారం చేసింది తెలుగుదేశం వాళ్లేనని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారు! తన తల్లిని తిట్టించిందని తెలుగుదేశం వాళ్లేనని కూడా పవన్ విరుచుకుపడ్డారు! మరి ఇప్పుడు ఆయన తెలుగుదేశం పల్లకినే మోస్తున్నారు!
తల్లిని తిట్టించారంటూ విరుచుకుపడి, తనకు ఒక కమ్మవాడు గుండు కొట్టించాడని కమ్మ వాళ్లు ఘనంగా చెప్పుకున్నారని వాపోయి.. ఇప్పుడు అదే కమ్మ పల్లకి మోయడం పవన్ కే సాధ్యం! మరి పవనే అన్ని విషయాలను చెప్పి తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి తన పార్టీనే తాకట్టు పెట్టేశారు!
ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు గతంలో పవన్ ను ఇష్టానుసారం తిట్టిన వారికి మద్దతుగా రేపు పవన్ ప్రచారం చేస్తే భలే మజా ఉంటుంది! పవన్ కల్యాణ్ తన సొంత అన్నను గెలిపించుకోలేకపోయాడని.. ఆయన తమనేం గెలిపిస్తాడంటూ గతంలో చింతమనేని ప్రభాకర్ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు! ఆ వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
తెలుగుదేశం పార్టీ వీరాభిమాన కమ్మ వాళ్లు పవన్ పై అప్పుడు, ఇప్పుడూ, ఎప్పుడూ ఎలాంటి అభిప్రాయంతో ఉంటారో అదే అభిప్రాయాన్ని చింతమనేని చెప్పారప్పుడు! మరి రేపే పొత్తులో భాగంగా చింతమనేని విజయం కోసం కూడా మళ్లీ పవన్ ప్రచారం చేస్తారు! అయితే.. చూసే వాళ్లు మాత్రం దీన్నంతా కామెడీగా తీసుకుంటారు.
అందుకే ఇప్పుడు చింతమనేనికి టికెట్ ఇవ్వకూడదని అనుకుంటున్నారట చంద్రబాబు నాయుడు! అయితే ఇది జస్ట్ లీకే! ముందుగా ఇలాంటి లీక్ ఇవ్వడం.. ఆ తర్వాత పవన్ ఓకే చెప్పారంటూ చింతమనేనికే టికెట్ కేటాయించడం తదుపరి డ్రామా! ఇలాంటి పొలిటికల్ డ్రామాలు చంద్రబాబుకు, తెలుగుదేశానికి చాలా పాతవి! వీటిని మూడు దశాబ్దాలుగా తెలుగు ప్రజలు చూస్తేనే ఉన్నారు! వాటినే ఇప్పుడూ కొనసాగిస్తున్నారంతే!