మనమే – శర్వానంద్ – బైక్ రైడర్

హిట్.. ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న హీరో శర్వానంద్. నిజానికి శర్వా హిట్ అనేది చూసి చాలా కాలం అయింది. ఈ రోజు శర్వా బర్త్ డే. ఈ సందర్భంగా మూడు…

హిట్.. ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న హీరో శర్వానంద్. నిజానికి శర్వా హిట్ అనేది చూసి చాలా కాలం అయింది. ఈ రోజు శర్వా బర్త్ డే. ఈ సందర్భంగా మూడు సినిమాల అప్ డేట్ లు ప్రకటిస్తున్నారు.

వీటిలో ఒకటి యువి సంస్థ నిర్మించే సినిమా. అభిలాష్ రెడ్డి దర్శకుడు. గతంలో లూజర్ అనే వెబ్ సిరీస్ అందించాడు. ఈ సినిమాలో శర్వానంద్ బైక్ రైడర్ గా కనిపించబోతున్నాడు. బైక్ రేస్ క్రీడ నేఫథ్యంలో ఈ సినిమా కథ అల్లుకున్నట్లు తెలుస్తోంది. గతంలో బైక్ రేస్ ఆధారంగా మైత్రీ సంస్థ విజయ్ దేవరకొండతో ఓ భారీ సినిమా ప్లాన్ చేసి, ప్రీ ప్రొడక్షన్ కు బాగా ఖర్చు చేసి, తరువాత వర్కవుట్ కాదని ఆపేసారు. కానీ యువి కాస్త డిఫరెంట్ థీమ్ తో తీస్తున్నట్లు కనిపిస్తోంది.

మరో అప్ డేట్ పీపుల్స్ మీడియా నుంచి వస్తుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈయన కూడా సరైన హిట్ పడాలని చూస్తున్నారు. హిట్ కోసం చూస్తున్న శర్వా, శ్రీరామ్ ఆదిత్య కలిసి చేస్తున్న సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ఈ రోజు వస్తుంది. మనమే అనేది టైటిల్ అంటూ వినిపిస్తోంది మరి. ఈ సినిమా ఇప్పటికే పూర్తయింది. త్వరలో విడుదల వుంటుంది.

ఇక మరో అప్ డేట్ ఎకె సంస్థ నుంచి వస్తుంది. సామజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజ పని చేస్తారు ఈ సినిమాకు. నిజానికి ఈ దర్శ‌కుడు, ఈ ప్రాజెక్ట్ వేరే వాళ్ల దగ్గరకు వెళ్లింది. కానీ రామ్ అబ్బరాజు రెండో సినిమా కూడా ఎకె కు చేయాల్సి వుంది. ఆ విధంగా శర్వానంద్ ను ఒప్పించి, ప్రాజెక్ట్ ను ఇక్కడకు తెచ్చారు. ఎకె లో శర్వానంద్ మహాసముద్రం సినిమా చేసారు. దాని తరువాత మళ్లీ ఇది చేస్తున్నారు.