ఎన్టీఆర్ విలన్ కాదు, వారియర్

వార్-2లో ఎన్టీఆర్ నటిస్తున్నాడనే న్యూస్ బయటకొచ్చినప్పట్నుంచి అతడి పాత్రపై ఓ రేంజ్ లో పుకార్లు వచ్చాయి. సినిమాలో అతడు నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తాడనే ప్రచారం విపరీతంగా నడిచింది. ఎందుకంటే, అందులో హీరోగా హృతిక్…

వార్-2లో ఎన్టీఆర్ నటిస్తున్నాడనే న్యూస్ బయటకొచ్చినప్పట్నుంచి అతడి పాత్రపై ఓ రేంజ్ లో పుకార్లు వచ్చాయి. సినిమాలో అతడు నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తాడనే ప్రచారం విపరీతంగా నడిచింది. ఎందుకంటే, అందులో హీరోగా హృతిక్ ఉన్నాడు కాబట్టి.

సాదారణంగా బాలీవుడ్ లో ఓ పెద్ద సినిమాలో విలన్ పాత్ర కోసం ఓ పెద్ద నటుడ్ని తీసుకోవడం చాన్నాళ్లుగా నడుస్తున్న ట్రెండ్. ధూమ్ సిరీస్ లో ఇదే జరిగింది. అలాగే వార్ కోసం కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నారనే ప్రచారం సాగింది. ఎట్టకేలకు ఈ అంశంపై క్లారిటీ వచ్చింది.

వార్-2లో ఎన్టీఆర్ విలన్ కాదు, ఆ మాటకొస్తే అతడు ఓ వారియర్. అవును.. వార్-2లో ఇండియన్ రా-ఏజెంట్ గా కనిపించబోతున్నాడట తారక్. యష్ రాజ్ ఫిలిమ్స్ గూఢచారి ప్రపంచంలో సల్మాన్ (టైగర్), హృతిక్ (కబీర్), షారూక్ (పఠాన్) తర్వాత ఎన్టీఆర్ (వార్-2) గూఢచారిగా కనిపించబోతున్నాడు. ఇది చాలా పెద్ద విషయం.

వార్-2లో హృతిక్-ఎన్టీఆర్ ఇద్దరూ హీరోలే. ఎవరి పాత్రలు వాళ్లకు ఉంటాయంట. కాకపోతే హృతిక్ పోర్షన్ కాస్త ఎక్కువగా ఉంటుందట, కీలకమైన సమయంలో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందట.

ఇక్కడే మరో విశేషం ఏంటంటే.. ఎన్టీఆర్ పాత్ర వార్-2తో ముగిసిపోదంట. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై-యూనివర్స్ లో రాబోయే చిత్రాల్లో కూడా తారక్, అక్కడక్కడ మెరుస్తాడంట. ఈ మేరకు యష్ రాజ్ ఫిలిమ్స్ తో దీర్ఘకాలిక ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. సో.. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ మరింత మంది బాలీవుడ్ స్టార్స్ తో కలిసి కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.