జై హనుమాన్.. త్వరలోనే ఫస్ట్ లుక్

సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమా హనుమాన్. ఈ సినిమా క్లయిమాక్స్ లోనే సీక్వెల్ ప్రకటించారు. దానికి జై హనుమాన్ అనే పేరు కూడా పెట్టారు. Advertisement ఆ తర్వాత కొన్ని రోజులకు…

సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమా హనుమాన్. ఈ సినిమా క్లయిమాక్స్ లోనే సీక్వెల్ ప్రకటించారు. దానికి జై హనుమాన్ అనే పేరు కూడా పెట్టారు.

ఆ తర్వాత కొన్ని రోజులకు దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా జై హనుమాన్ ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభించినట్టు ప్రకటించాడు. ఇప్పుడీ ప్రాజెక్టుకు సంబందించి మరికొన్ని వివరాలు వెల్లడించాడు.

“జై హనుమాన్ పనులు మొదలయ్యాయి. అతి త్వరలోనే ఆ సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్ ను లాంచ్ చేయబోతున్నాం. హనుమాన్ సినిమా క్లయిమాక్స్ లో చివరి 5 నిమిషాలు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఆ చివరి 5 నిమిషాలు ఎలా ఉందో, జై హనుమాన్ రెండున్నర గంటల సినిమా మొత్తం అలా ఉండబోతోంది.”

జై హనుమాన్ ఫస్ట్ పోస్టర్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్న విషయాన్ని ప్రకటించాడు దర్శకుడు. హనుమాన్ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించాడు. హనుమంతుడి పాత్ర చివర్లో వస్తుంది. జై హనుమాన్ లో మాత్రం హనుమంతుడే హీరో అని ప్రకటించాడు ప్రశాంత్.

హనుమంతుడి పాత్ర కోసం ఇప్పటికే ఓ పెద్ద నటుడ్ని సంప్రదించినట్టు వెల్లడించాడు ఈ డైరక్టర్. ఫస్ట్ పోస్టర్ లాంచ్ సందర్భంగా ఆ హీరో ఎవరనేది బయటపెడతాడేమో చూడాలి.