జగన్ ను ఓడించడానికి రెండు కూటములు

ఏపీలో పాలిటిక్స్ చాలా రసవత్తరంగా ఉన్నాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైఎస్ జగన్ ను మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయడం కోసం ప్రతిపక్షాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.  Advertisement ఒకపక్క నుంచి టీడీపీ…

ఏపీలో పాలిటిక్స్ చాలా రసవత్తరంగా ఉన్నాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైఎస్ జగన్ ను మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయడం కోసం ప్రతిపక్షాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. 

ఒకపక్క నుంచి టీడీపీ అండ్ జనసేన ఒక కూటమిగా ఏర్పడగా (వీళ్ళతో బీజేపీ కలుస్తుందో లేదో ఇంకా క్లారిటీ రాలేదు), మరో వైపు నుంచి కాంగ్రెస్, వామపక్షాలు (సీపీఐ అండ్ సీపీఎం) మరో కూటమిగా ఏర్పడుతున్నాయి. దీన్ని ఇండియా కూటమి అంటున్నారు.

ఈ కూటమిలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ కూడా చేరుతుంది అంటున్నారు. ఈ రెండు కూటములకు ఎదురొడ్డి నిలుస్తోంది వైఎస్సార్ సీపీ. ఒక్క పార్టీని ఓడించడానికి ఇప్పటికైతే అయిదు పార్టీలు రెండు కూటములుగా ఏర్పడ్డాయి.

జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలవటం ఖరారైందని చెబుతున్నా.. అధికారికంగా ఎలాంటి నిర్ణయం జరగలేదు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతోనే తాము కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నామని చంద్రబాబు, పవన్ పదే పదే చెబుతున్నారు.

టీడీపీతో పొత్తు ఖాయం చేసుకోవాలని భావించిన సీపీఐ, సీపీఎం పార్టీలు ఇప్పుడు చంద్రబాబు బీజేపీతో పొత్తుకు ఆసక్తి చూపటంతో కాంగ్రెస్ తో కలవాలని నిర్ణయించారు. తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలతో పొత్తు ఖరారైంది. కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. 

కాంగ్రెస్ ఏపీ పగ్గాలు చేపట్టిన సమయం నుంచి షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అన్న..సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో పార్టీలో చేరికల పైన ఫోకస్ చేసారు. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరించగా అనూహ్య స్పందన వచ్చింది. ఇదే సమయంలో బీజేపీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిసి ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా కూటమి కట్టాలని నిర్ణయించారు.

సీట్ల పంకాల పైన త్వరలో సమావేశాలు జరుపుతారు.  ఈ కూటమిలో సీబీఐ మాజీ జేడీ పార్టీ కలుస్తుందనే ప్రచారం సాగుతోంది. కానీ, ఇంకా ఆయన నుంచి దీని పైన స్పష్టత రాలేదు. తాజా నిర్ణయంతో ఏపీలో ఎన్డీఏ, ఇండియా కూటమి, వైసీపీ పార్టీలతో త్రిముఖ పోటీ వాతావరణం కనిపిస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే ఏపీలో పోరు హోరాహోరీగా జరగబోతోందని అర్థమవుతోంది.