ఆ మధ్యనే ప్రకటించారు వెంకీ కుడుముల..మెగాస్టార్ కాంబినేషన్ లో డివివి దానయ్య సినిమా అంటూ. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఆ సినిమా డౌట్ అంటూ గ్యాసిప్ లు బలంగా వినిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న జరిగిన ఆచార్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మెగాస్టార్ తో సినిమాలు చేస్తున్న డైరక్టర్లు, నిర్మాతలు అందరూ హాజరయ్యారు. ఒక్క వెంకీ కుడుమల తప్ప.
అయితే వెంకీ కుడుమల హాజరు కాకపోవడానికి ముందు రోజు నుంచే ఈ గ్యాసిప్ వినిపించడం ప్రారంభమైంది. దానికి ఈ గైర్హాజరు కారు. ఎందుకంటే మెగాస్టార్ ఫంక్షన్, పైగా ఆయనతో సినిమా ఇంకా ప్లానింగ్ లో వుంది.
అలాంటి అవకాశాన్ని వెంకీ ఎందుకు మిస్ చేసుకుంటారు. మరీ అత్యవసరమై, అనివార్యమై తప్పకపోతే తప్ప. ఇదిలా వుంటే ఆ సినిమా చేయబోయే నిర్మాత దానయ్య కూడా ప్రసంగించారు. కానీ స్పీచ్ లో త్వరలో బాస్ తో సినిమా చేయబోతున్నా అని అనలేదు.
మొత్తానికి ఈ సినిమా మీద గ్యాసిప్ లు అయితే మొదలయ్యాయి. కొద్ది రోజులు ఆగితే వుందా లేదా అన్న క్లారిటీ రావచ్చు. ప్రస్తుతానికి అయితే గ్యాసిప్ లు వినిపిస్తూనే వుంటాయి.