పాత వీడియోలు బయటకు వస్తున్నాయి

ఒకప్పుడు అంటే ఎవరు ఎలా ఎక్కడ ఏం మాట్లాడినా.. తూచ్ అంటే సరిపోయేది.  కానీ ఇప్పుడు అలా కాదు. డిజిటల్ యుగం. ప్రతి ఒక్కటీ సాక్ష్యాలతో బతికే వుంటుంది. Advertisement ఇప్పటికి అనేక సార్లు…

ఒకప్పుడు అంటే ఎవరు ఎలా ఎక్కడ ఏం మాట్లాడినా.. తూచ్ అంటే సరిపోయేది.  కానీ ఇప్పుడు అలా కాదు. డిజిటల్ యుగం. ప్రతి ఒక్కటీ సాక్ష్యాలతో బతికే వుంటుంది.

ఇప్పటికి అనేక సార్లు కలిసి కాపురం చేసి, మళ్లీ విడాకులు అందుకుని, మళ్లీ కలిసి కాపురం చేసిన ఘనత తెలుగుదేశం-భాజపాలకే చెల్లుతుంది. పైగా గమ్మత్తయిన సంగతి ఏమిటంటే విడిపోయిన ప్రతిసారీ భాజపా మీద విరుచుకుపడిపోయింది కూడా తెలుగుదేశం పార్టీ. దాని సామాజిక మూలల ఎల్లో మీడియా.

మోడీని ఎవరు ఏమన్నారు. భాజపాను ఎవరు ఏమన్నారు అన్నీ ఇక్కడే రికార్డులతో పదిలంగా వున్నాయి. పాచి పోయిన లడ్లు అని ఎవరు అన్నారో, లడేంగే..లడేంగే..అని ఎవరు రంకెలు వేసారో అందరికీ గుర్తు చేయడానికిం వీడియోలు వుండనే వున్నాయి.

ఇక నీళ్లు..మట్టి మొహాన కొట్టారు అన్నవారూ వున్నారు. నిన్న మొన్నటి వరకు ఎల్లో మీడియాలో వండి వార్చిన మోడీ వ్యతిరేక వార్తలు వుండనే వున్నాయి. ఇక మోడీ కూడా చంద్రబాబు మీద వేసిన చెణుకులు రెడీ. ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారిగా బయటకు వస్తున్నాయి.

స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే జగన్ ను తిట్టడం తప్ప మోడీని పల్లెత్తు మాట అనలేదు దేశం-సేన. మరి ఇప్పుడు వాళ్లు భాజపాతో జత కట్టారు కనుక, ఇక ఆ భూములు కాపాడడం, అవి అమ్మకం కాకుండా చూడాల్సిన బాధ్యత బాబు-పవన్ లదే.

ఇక విభజన హామీలు కూడా వుండనే వున్నాయి. వాటి సంగతి కూడా తేల్చాలి. ఈ టైమ్ లోనే పాత విడియోలు అన్నీ బయటకు వచ్చి భలే వినోదం పండించబోతున్నాయి.