అన్ని రోజులు ఒకలా ఉండవు అన్ని ఎన్నికలు ఒకేలా ఉండవు అన్నది రాజకీయ నాయకులకు బాగా వర్తిస్తుంది ప్రజల మధ్యన లేకుండా కాలక్షేపం కబుర్లు విమర్శలతో సరిపెడితే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నది ఇప్పుడు తాజాగా విశాఖపట్నం రాజకీయం చూసినప్పుడు అర్థమవుతుంది.
విశాఖపట్నం తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. గత రెండు సార్లు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా గణబాబు విజయం సాధిస్తూ వచ్చారు. 2014లోనూ 2019 లోను గణనీయంగా ఆయన గెలుపు సాధ్యమైంది. 2019లో జగన్ హవాలోనూ 30 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గణబాబు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి సీన్ రివర్స్ గా మారుతుంది. కోవిడ్ సమయంలో కనీసం ప్రజల వైపు కన్నెత్తి కూడా చూడని ఎమ్మెల్యే వారి కనీస అవసరాలు ఏంటి అనేది తెలుసుకోకుండా కాలక్షేపం చేస్తూ ఇంట్లోనే గడిపిన సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబుకు ఇప్పుడు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు.
ఇంతవరకు సరైనోడు దొరక్క విజయాలు సాధిస్తూ ఉంచిన గణబాబుకు ఈసారి వైసీపీ అనూహ్యంగా ఆడారి ఆనంద్ కుమార్ ను రంగంలోకి దించింది. ఆడారి ఆనంద్ కుమార్ కుటుంబమంతా విశాఖ డైరీ చుట్టూ మమేకమే ఉంటుంది. లక్షలాది మంది రైతులతో వారి అనుబంధం కొనసాగుతోంది.
విశాఖపట్నం వెళ్ళు నువ్వు ఖచ్చితంగా గెలిచి వస్తావు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో రంగంలో దిగిన ఆడారి ఆనంద్ కుమార్ పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జిగా ఏడాదిన్నరగా పనిచేస్తూ ప్రస్తుత వైసిపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. తనకు వచ్చిన సదవకాశాన్ని ఆడారి ఆనంద్ కుమార్ విడిచి పెట్టుకోలేదు. ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొస్తూ సుమారుగా 235 కోట్ల రూపాయలు సీఎం ద్వారా విడుదల చేయించుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
అలాగే తన సొంత నిధులు సుమారుగా 20 కోట్లతో పేదలకు బడుగు బలహీన వర్గాలకు తన చేతనైనంత సహాయం చేసి మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో అభ్యర్థుల గుణగణాలు వారి లక్షణాలు ఆదరించే తీరు ఆదుకున్న తీరు ఇవన్నీ గమనిస్తున్న పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఆడారి ఆనంద్ కుమార్ కు ఒకసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం అవుతుంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే టిడిపికి చెందిన గణబాబు క్రీడాకారుడుగా మంచి పేరు ఉన్నప్పటికీ గత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దగా సాధించింది ఏమో లేదు అన్న భావన ప్రధానంగా కనిపిస్తోంది. తన సొంతంగా ఆర్థికంగా బలపడినప్పటికీ ప్రధానమైన సమస్యల పరిష్కారంలో ఏమి చేయలేదన్న భావనైతే కనిపిస్తోంది. ఆయన కలవాలంటే చాలామందిని దాటి వెళ్లాలి.
ఆయన కోటరీని దాటి వెళ్లడం అంత ఈజీ కాదు అన్న భావన ప్రజల్లో నెలకొండంతో సామాన్య మధ్య తరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజానీకం ఎమ్మెల్యే పై ఆశలను వదులుకుంది. గత నాలుగున్నర ఏళ్లుగా ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి కూడా గణబాబుకు ఇప్పుడు పెద్ద మైనస్ గా మారింది. ప్రధాన సమస్యల పరిష్కారం రహదారులు, రిటైనింగ్ వాల్స్, పంచ గ్రామాల సమస్య విషయంలో గణబాబు సాధించిందేమీ లేదు.
ఇంతవరకు గణబాబును కాపాడుకుంటూ వచ్చిన అతని సామాజిక వర్గం గవర సామాజిక వర్గానికి సంబంధించిన ప్రధానమైన వర్గం అంతా ఇప్పుడు ఆడారి చెంతకు చేరింది. ఆడారి ఆనంద్ కుమార్ కూడా ఇదే సామాజిక వర్గం కావడంతో పైగా సహాయ సహకారాలు ఇచ్చే విషయంలో ఆయన తక్కువ మాటలు చెప్పడం ఎక్కువ అభివృద్ధి పనులు చేయడం లాంటివి ప్రజానీకానికి ఇష్టపడుతున్నాయి. అది తక్కువ సమయంలోనే ఉద్యోగాల కల్పన విషయంలో ప్రధానంగా దృష్టి పెట్టడం జాబ్ మేళాలో ఏర్పాటు చేయడం అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించడం లాంటివి యువతకు బాగా ఆకట్టుకునేలా చేసాయి.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గంలో 15 వార్డులు ఉంటే 12 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులే గెలవడం విశేషం. ఈ విజయాలు కూడా కచ్చితంగా ఈ ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం లో వైసీపీ విజయానికి దోహదపడుతుంది అన్న అంచనా కూడా ఉంది. గత కొంత కాలంగా ఆడారి ఆనంద్ కుమార్ ప్రజలతో మమేకం కావడం అభ్యర్థిగా తనను గెలిపిస్తే ఏదో ఒకటి సాధిస్తారు ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటారు అన్న నమ్మకం.. ఎదురైన సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తారన్న భావనతో ఉండటం వల్ల ఈసారి నియోజకవర్గ ఓటర్లలో కొంత మార్పు కనిపిస్తున్నట్లు స్పష్టంగా చెప్పుకోవచ్చు.
మరోవైపు కూటమిలో ఉన్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. జనసేన నాయకులు కలిసి రాకపోవడం, అలాగే కీలక నేతలుగా ఉన్న పాసర్ల ప్రసాద్ లాంటి నేతలు గణబాబుకి టికెట్ కేటాయింపు పై టిడిపి అధిష్టానం పై అసంతృప్తి చెందుతూ రాజీనామా చేసి వెళ్లిపోవడం అలాంటి ఎన్నో సమస్యలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గణబాబుకు వేధిస్తున్నాయి.
కాలం కలిసి రాకపోతే ఎంత పెద్ద నాయకుడైనా ప్రజలు చేతుల్లో ఓటమి చవించకూడదు తప్పదు ఇదే పరిస్థితి ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి గణబాబుకు ఎదురవుతుంది.