ఏపీ ప్రభుత్వ అధ్వర్వంలో విజయవాడ సమీపంలోని కానూరు వేదికగా జరిగిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభ ఘనంగా జరిగింది. ప్రభుత్వ పెద్దలు, సినీ రంగ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై రామోజీరావు సేవలను కొనియాడారు. ఇందులో ముఖ్యంగా సంగీత దర్శకుడు కీరవాణి రామోజీరావుని కీర్తిస్తూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు.
కీరవాణి మాట్లాడుతూ.. ‘రామోజీరావు తనకు సంగీత దర్శకుడిగా జన్మనిచ్చారని గుర్తుచేస్తు.. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని.. ఆయనలా ఒక్కరోజు జీవించినా చాలని గతంలోను చెప్పా.. ఇప్పుడు చెబుతున్నా అంటూ.. భీష్ముడు తాను అనుకున్నప్పుడే దేహాన్ని విడిచారు. అదే తరహాలో రామోజీ కూడా కబంధ హస్తాల నుంచి ఏపీ విడుదలైన తర్వాతే స్వర్గస్థులయ్యారు’ అంటూ జగన్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “రామోజీరావు అందించిన స్ఫూర్తి భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని. ఆయన సమాజానికి ఎంతో సేవ చేశారని. ఏ రంగంలో అయినా.. రామోజీరావు నంబర్ వన్‌గా ఉన్నారని. ఆయన వ్యక్తి కాదు.. వ్యవస్థ అని. రాజధానికి అమరావతి పేరును ఆయనే సూచించారు. అందుకే అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం అని. ఎన్టీఆర్, రామోజీరావులకు భారతరత్న సాధించడం మన బాధ్యత” అని చెప్పుకొచ్చారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “నేను చూసిన రామోజీరావులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, సినిమాలు చేసే సమయంలో రామోజీరావుతో ప్రత్యక్ష అనుబంధం లేదు కానీ, 2008లో నేరుగా ఒకసారి రామోజీరావును కలిసి మాట్లాడటం జరిగిందని” అన్నారు. సభలో మాట్లాడిన ఎవరు కూడా రాజకీయ విమర్శలకు వెళ్లకున్నా కీరవాణి మాత్రం జగన్‌ను టార్గెట్ చేయడం గమనార్హం. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర గీతం కోసం సంగీతం అందించి వివాదాల్లోకి వచ్చిన ఆయన తాజాగా మాజీ సీఎంను టార్గెట్ చేశారు. సంస్మరణ సభలో రాజకీయ విమర్శలు అవసరమా? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు.
idhi k kukkenaa
కుమార్ గారు, మీరు మద్దతు ఇస్తున్న పార్టీకి ప్రజల నుండి ఎదురుదెబ్బ వచ్చినప్పుడు తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లడం సహజమే. జగన్‌గారికి అనేక కోటలు ఉన్నాయి, మీరు వాటి దగ్గరికి కూడా వెళ్లలేరనుకుంటా, వారు సంతోషంగా ఉన్నారు. ఎందుకు మీరు అలాంటి డిప్రెషన్‌లోకి వెళ్లాలి? వారికి భజన ఎందుకు చేయాలి? ఇంకో విషయం, మీలాంటి వారు కుల ఆధారిత విభజనలను ప్రోత్సహించడం వల్లనే జగన్ ఈ ఎన్నికల్లో ఓడిపోయాడు