అడిగింది ఇవ్వకుంటే జగన్ ఏం చేస్తారు?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సభాపతికి లేఖ రాశారు. తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను శాసనసభలో ప్రస్తావించాలంటే.. గట్టిగా పోరాడాలంటే ప్రతిపక్ష గుర్తింపు ఉండడం అవసరం…

వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సభాపతికి లేఖ రాశారు. తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను శాసనసభలో ప్రస్తావించాలంటే.. గట్టిగా పోరాడాలంటే ప్రతిపక్ష గుర్తింపు ఉండడం అవసరం అని పేర్కొన్నారు. దాని మీద ఇప్పుడు చాలా రాద్ధాంతం జరుగుతోంది. జగన్ వైసీపీ ఫ్లోర్ లీడర్ గా చెలామణీ కాగలరే తప్ప.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయనకు దక్కదని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల తెగేసి చెప్పేశారు. స్పీకరు నిర్ణయం కూడా పయ్యావువల మాటలకు అనుగుణంగానే ఉంటుందా? లేదా? అనేది వేచిచూడాలి.

అయితే.. ఇప్పుడు ప్రజల్లో ఇంకో సందేహం కూడా మెదలుతోంది. జగన్ ప్రతిపాదనకు స్పీకరు నో చెబితే గనుక.. దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి. జగన్ ఎలా స్పందిస్తారు? ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు అని స్పీకరు సమాధానం చెబితే.. జగన్ ఏం చేస్తారు? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

శాసనసభ సమావేశాలకు రాబోయే అయిదేళ్ల పాటూ తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా హాజరు కాకుండా స్కిప్ చేయడానికే జగన్ ఇలాంటి ఎత్తుగడ వేశారని, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఆ సాకు చూపించి సభ ఎగ్గొడతారని అంతా అనుకుంటున్నారు. మరి అలాంటప్పుడు.. జగన్ పార్టీలోని 11 మందిని గెలిపించిన ప్రజల పరిస్థితి ఏమిటి?

నిజం చెప్పాలంటే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు.. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్టుగా లెక్కవేయకూడదు. జగన్ తన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ భరోసా ఇచ్చినట్టుగా.. ఆ పార్టీని, జగన్ నాయకత్వాన్ని 40 శాతం మంది రాష్ట్ర ప్రజలు నమ్మారనే సంగతిని గుర్తుంచుకోవాలి.

40 శాతం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడానికి జగన్ ఏం చేస్తున్నారు? ఆయన సభకు వెళ్లకుండా, ప్రభుత్వం ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు సభా ముఖంగా పోరాడకుండా, ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించకుండా తప్పించుకుని తిరిగితే ఆ 40 శాతం మంది జగన్ వైఖరిని ఎలా అర్థం చేసుకుంటారు అనేది ప్రశ్న! జగన్ అయిదేళ్లు సభకు హాజరు కాదలచుకోకపోతే.. ఆ నలభైశాతం మంది ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని అవమానించినట్లే కదా? అనేది పలువురికి కలుగుతున్న సందేహం.

ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడడానికి ప్రతిపక్ష హోదా ఉండాల్సిందే అని జగన్ లేఖలో రాశారు. కానీ ఆ హోదా లేకపోయినా కూడా సమస్యలపై పోరాడడానికి అవకాశం లేకుండా పోదు. కేవలం ‘గట్టిగా’ అనే ఒక్క పదం కోసం జగన్ తన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని అవమానిస్తారా? అనే చర్చ జరుగుతోంది.

16 Replies to “అడిగింది ఇవ్వకుంటే జగన్ ఏం చేస్తారు?”

  1. స్కూల్స్ లో, కాలేజెస్ లో అటెండన్స్ 90% లేకుంటే exam రాయనియ్యరు. అలాగే, ఒక సారి MLA ఓర MP గ గెలిచినా తరువాత, అసెంబ్లీకి 90% అటెండెన్స్ లేకపోతే, తరువాత 10 సంవత్సరాలు ఎన్నికలలో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి.

  2. స్కూ/ల్స్/ లో, కా/లే/జె/స్/ లో/ అ/టెం/డ/న్స్/ 90% లే/కుం/టే/ e/x/a/m రా/య/ని/య్య/రు. అ/లా/గే/, ఒ/క/ సా/రి/ M/L/A/ or M/P/ గె/లి/చి/నా/ త/రు/వా/త/, అ/సెం/బ్లీ/కి 90% అ/టెం/డె/న్స్ లే/క/పో/తే, త/రు/వా/త 10 సం/వ/త్స/రా/లు ఎ/న్ని/క/ల/లో/ పో/టీ/కి అ/న/ర్హు/డి/గా ప్ర/క/టిం/చా/లి.

  3. Ipudu jagan assemblyki velthe matram 40% Public Demands teeruthaya?

    Ilanti Outdated Batch Ideas valle Jagan M ayadu..

    Publiclo vundadam imp..adhi elago chestadu muskuni kurchora babu..nuvu nee outdated ideas lucha GA.

  4. ప్రతి మంగళవారం అప్పు 

    అని జగన్ మీద విషం చిమ్మిన ఈనాడు జ్యోతి ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదు 

    (జూన్ 12 న బాబు ప్రమాన శ్వీకారం చేశారు 

    జూన్ 25 న (మంగళవారం) రిజర్వ్ బ్యాంకు దగ్గర వేలం పాటలో

     2 వేల కోట్లు అప్పు చేసిన బాబు ప్రభుత్వం 

    జులై 2 (మంగళవారం ) రిజర్వ్ బ్యాంకు దగ్గర వేలం పాటలో 

    5 వేల కోట్లు అప్పు తీసుకోనున్న బాబు ప్రభుత్వం 

    అంటే 20 రోజుల్లో 7 వేల కోట్ల అప్పు 

    ఆ విధంగా సంపద సృష్టిలో తలమునకలై ఉన్న విజనరీ బాబు )

  5. K-batch దోపిడీ మొదలు. 

    పుణ్యం పురుషార్డం. ఇలాంటివి ఎన్నో చుటబోతున్నం వచ్చే 5 ఏళ్లలో… భారత్ బీజేపీ అంబానీ అడానిలకు కట్ట బెట్టినట్లు, ఇప్పటివరకు రాష్ట్రం లో 65% ఆస్తులు ఒక సామాజిక వర్గానికి కట్ట బెడితే, వచ్చే 5 ఏళ్లలో ఈ 65% నీ 80% తీసుకెళితే, జీవితం లో టీడీపీ నే ప్రభుత్వం వస్తూనే వుంటుంది..ఎందుకంటే కార్పొరేట్ మరియు రాష్ట్ర ఆస్తులు మొత్తం వాళ్ళ చేతిలో వుంటాయి… ఇదే జరిగితే, మిగతా 90% మంది ఓ 5% వర్గానికి బానిసల గా మారి పోతారు… ఇది ప్రజలకు అర్దం అయ్యే లోపల అసెట్లు అన్ని వాళ్ళ చేతిలోకి వెళ్లి పోతాయి… అప్పుడు వాళ్లకు వోటోసి న ప్రతి వాడికి అర్దం అయిన వాడి జీవితం బానిసత్వం మాత్రమే…

  6. టీడీపీ అరాచకాలు మొదలయ్యాయి

    * వైజాగ్ గాంధీ హాస్పిటల్ ని HCG గ్రూప్ కి 714 కోట్లకి అమ్మేసిన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం*

    వైజాగ్ లో ఉన్న 196 బెడ్ ల మహాత్మా గాంధీ కాన్సర్ హాస్పిటల్ ని 414 కోట్లకి 54% షేర్ ని HCG గ్రూప్ సంస్థకి అమ్మేసిన ఆంధ్రప్రదేశ్ నూతన కూటమి ప్రభుత్వం 

    మరో 34% షేర్ ని రాబోయే 18 నెలల కాలం లో అదే HCG గ్రూప్ కి 300 కోట్ల కి అమ్మకానికి ఒప్పందం 

    గమనిక: ఈ హాస్పిటల్ 2024 సంవంత్సరం లో ఆదాయం 162.4 కోట్లు 

    ఇంత ఆదాయం ఉన్న హాస్పటల్ ని కేవలం 714 కోట్లకి ప్రైవేట్ సంస్థకి అమ్మేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది 

    గత ప్రభుత్వం లో కొత్తగా హాస్పిటల్ లు మెడికల్ కాలేజీ లు – పలాస లో కిడ్నీ రెసర్చ్ సెంటర్ మరియు కిడ్నీ కేర్ హాస్పిటల్ కడితే- నూతన కూటమి ప్రభుత్వం హాస్పిటల్ లు అమ్మేయడం విడ్డురాం గా ఉంది 

    ఇక వైజాగ్ వాసులు- ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉచిత వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతుంది- దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి ( దీనిని ప్రశ్నించడానికి ప్రతిపక్షం లేకపోవడం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కి కలిసివస్తుంది)

    సోర్స్: ఎకనామిక్స్ టైమ్స్ అఫ్ ఇండియా

Comments are closed.