కేసీఆర్​ పట్టు వదలని అక్రమార్కుడా ?

కరెంటు కొనుగోళ్లు, విద్యుత్​ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న నరసింహాడ్డి కమిషన్​ ఎదుట హాజరు కాకూడదని కేసీఆర్​ గట్టి పట్టుదలతో ఉన్నారు. మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు హాజరుకాకపోగా విచారణ…

కరెంటు కొనుగోళ్లు, విద్యుత్​ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న నరసింహాడ్డి కమిషన్​ ఎదుట హాజరు కాకూడదని కేసీఆర్​ గట్టి పట్టుదలతో ఉన్నారు. మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు హాజరుకాకపోగా విచారణ కమిషన్​కే 12 పేజీల లేఖ రాసిన సంగతి తెలిసిందే. అసలు కరెంటుకు సంబంధించిన ఆరోపణలపై విచారించే అర్హత కమిషన్​కు లేదన్నారు. 

అంతే కాకుండా ఇది చట్టబద్ధమైన కమిషన్​ కాదని, నరసంహారెడ్డి కమిషన్​ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కేసీఆర్​ డిమాండ్​ చేశారు. కేసీఆర్​ తన లేఖలో ప్రస్తావించిన అనేక అంశాలను కమిషన్​ సమయం తీసుకొని కూలంకషంగా పరిశీలించింది. సమీక్ష చేసింది. కేసీఆర్​ లేఖను పరిశీలించాక, అధికారులు చెప్పింది విన్నాక సమస్త నిర్ణయాలు కేసీఆరే సోలోగా తీసుకున్నారని కమిషన్​ అభిప్రాయపడింది. దీనిపైన వివరణ ఇవ్వాలని కేసీఆర్​కు కమిషన్​ నోటీసులు పంపింది. ఆయన ఈ నెల 28 కల్లా కమిషన్​ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

కమిషన్​ నోటీసులు ఇవ్వడం రెండోసారి. కాని వివరణ ఇవ్వడాన్ని గులాబీ బాస్​ అవమానంగా భావిస్తున్నారు. అందుకే ఈ కమిషన్​ చెల్లదని, చట్ట విరద్ధమని హైకోర్టులో పిటిషన్​ వేశారు. తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని కమిషన్​ నోటీసులు పంపిందని, వాటిని కొట్టేయాలని పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ కమిషనే చట్టబద్ధం కాదు కాబట్టి నరసంహారెడ్డి తప్పుకోవాలని మరోసారి డిమాండ్​ చేశారు. ఈ పిటిషన్​ విచారణకు ఎప్పడు వస్తుందో తెలియదు. ఒక పక్కేమో కమిషన్​ నోటీసులు ఇచ్చింది. దాని ప్రకారం 28 కల్లా వివరణ ఇవ్వాలి. 

మరో పక్క కేసీఆర్​ పిటిషన్​ విచారణకు రావల్సివుంది. కమిషన్​ విచారణకు డేట్​ ఫిక్స్​ చేసింది. హైకోర్టు ఇంకా నిర్ణయించలేదు. కాబట్టి ఈ రెండు రోజుల్లో హైకోర్టు పిటిషన్​ విచారణకు స్వీకరించాలి. న్యాయనిపుణల అభిప్రాయం ప్రకారం కేసీయార్ కు నోటీసులిచ్చి విచారణకు పిలిపించే అధికారం కమిషన్ కు ఉంది. ‘కమిషన్ నోటీసులకు కేసీయార్ సమాధానం చెప్పాల్సిందే’ అంటున్నారు. ‘కేసీయార్ ను అరెస్టుచేసి విచారణ చేసే అధికారం కమిషన్ కు ఉంటుంద’ని స్పష్టం చేశారు. కమిషన్ విచారణకు హాజరుకాననేందుకు కేసీయార్ కు అవకాశం లేదన్నారు.

‘బెయిలబుల్ లేదా నాన్ బెయిలబుల్ నోటీసులిచ్చి కేసీఆర్​ను విచారణకు పిలిపించే అన్నీ అధికారాలు కమిషన్ కు ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ కేసీఆర్​కు తెలియవా? తెలుసు. ఆయన స్వతహాగా మేధావి కాబట్టి తెలుసుకొనే ఉంటారు. కాని కమిషన్​ ఎదుట హాజరు కాకూడదన్న మొండి పట్టుదల. అంతే. ఆయన కూతురు కవిత కూడా లిక్కర్​ కుంభకోణంలో సీబీఐ, ఈడీ విచారణకు హాజరు కాకుండా ఉండేందుకు రకరకాల వాదనలతో కోర్టులో పిటిషన్లు వేసి కాలయాపన చేసింది. ఏవేవో రూల్స్​ మాట్లాడింది. కాని …చివరకు ఏమైంది. అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇప్పటివరకు బయటకు రాలేదు. కేసీఆర్​ పరిస్థితి కూడా అలా అవుతుందా?