వింటేజ్ శంకర్ ఈజ్ బ్యాక్

సరైన హిట్ ట్రాక్ రికార్డు లేని నేపథ్యంతో మరోసారి తెర మీదకు వస్తోంది దర్శకుడు శంకర్-భారతీయుడు 2 సినిమా. ఈ సినిమా విడుదల మరో ఇరవై రోజుల్లో వుంది అనగా, ఇప్పుడు ట్రయిలర్ విడుదల…

సరైన హిట్ ట్రాక్ రికార్డు లేని నేపథ్యంతో మరోసారి తెర మీదకు వస్తోంది దర్శకుడు శంకర్-భారతీయుడు 2 సినిమా. ఈ సినిమా విడుదల మరో ఇరవై రోజుల్లో వుంది అనగా, ఇప్పుడు ట్రయిలర్ విడుదల చేసారు. ట్రయిలర్ విషయం పాతదే. అదే అవినీతి. మళ్లీ మరోసారి భారతీయుడు రంగంలోకి దిగడం. శంకర్ అంటే జంటిల్ మన్ లో వుండే ఎమోషన్, యాక్షన్ సీన్లు గుర్తుకు వస్తాయి. భారతీయుడు వన్ లో వుండే ఫన్ గుర్తుకు వస్తుంది. అన్ని సినిమాల్లో కనిపించే భారీ చిత్రీకరణలు గుర్తుకు వస్తాయి.

భారతీయుడు ట్రయిలర్ వాటన్నింటినీ మరోసారి గుర్తు చేసింది. అలా అని చెప్పి వాటిని దాటిందని చెప్పలేము. ఆ రేంజ్ ఎమోషన్ కనిపించలేదు.. కొంత వరకు టచ్ చేసారు. కమల్ ఏజ్ వల్ల కావచ్చు. యాక్షన్ సీన్లు ట్రయిలర్ కట్ లో ఓ మాదిరిగా వున్నాయి. ట్రయిలర్ లో.. లంచం.. లంచం.. లంచం…లాంటి పవర్ ఫుల్ డైలాగు పడి వుంటే ఇంకా బాగుండేది. పాటల చిత్రీకరణ మాత్రం పక్కా శంకర్ మార్క్ వుంది. ఇది ట్రయిలర్ మాత్రమే కనుక పూర్తి కంటెంట్ చూడకుండా పూర్తి జడ్జ్ మెంట్ పాస్ చేయలేరు. కానీ శంకర్ మీద కాస్త హోప్ అయితే భారతీయుడు 2 ట్రయిలర్ కలిగించింది.

శంకర్ నుంచి ఒకే ఏడాదిలో రెండు సినిమాలు వస్తున్నాయి. భారతీయుడు 2, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్. చరణ్ ఫ్యాన్స్ అంతా భారతీయుడు 2 సినిమా కోసం చూస్తున్నారు. ఇది చూస్తే శంకర్ మ్యాజిక్ టచ్ ఇంకా అలాగే వుందా లేదా అన్నది ఓ అంచనాకు వస్తుంది. గేమ్ ఛేంజర్ సినిమా మీద అప్పుడు అంచనాలు పెరుగుతాయి.