వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన హీరోయిన్

హీరోయిన్ సోనాక్షి సిన్హా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ ను ఆమె పెళ్లాడింది. బాంద్రాలోని శత్రుఘ్ను సిన్హా నివాసంలో ఈ పెళ్లి సింపుల్ గా జరిగింది. Advertisement పెళ్లికి తన…

హీరోయిన్ సోనాక్షి సిన్హా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ ను ఆమె పెళ్లాడింది. బాంద్రాలోని శత్రుఘ్ను సిన్హా నివాసంలో ఈ పెళ్లి సింపుల్ గా జరిగింది.

పెళ్లికి తన తల్లి పూనమ్ సిన్హాకు చెందిన చీర, నగల్ని ధరించింది సోనాక్షి. హీరోయిన్లంతా డిజైనరీ దుస్తులు ధరిస్తే, సోనాక్షి మాత్రం తల్లిపై ఇష్టాన్ని ఇలా ప్రదర్శించింది. అటు వరుడు జహీర్ ఇక్బాల్ కూడా సింపుల్ దుస్తులే ధరించాడు.

వీళ్ల పెళ్లిపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. పెళ్లి హిందూ సంప్రదాయంలో జరుగుతుందా లేదా ముస్లిం పద్ధతిలో జరుగుతుందా అనే విషయాన్ని చాలామంది చర్చించుకున్నారు. అయితే వీళ్లు మాత్రం ఈ సంప్రదాయలకు భిన్నంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద శత్రుఘ్ను సిన్హా ఇంట్లో అధికారుల సమక్షంలో సోనాక్షి-ఇక్బాల్ ఇద్దరూ సంతకాలు చేసి పెళ్లి తంతు పూర్తి చేశారు.

ఈ పెళ్లి తర్వాత సోనాక్షి, ఇస్లాం స్వీకరిస్తుందనే ప్రచారం సాగింది. దీన్ని ఇక్బాల్ తండ్రి ఖండించారు. ఆమె తన మతాన్ని అనుసరిస్తుందని స్పష్టం చేశారు.

పెళ్లి వేడుక పూర్తయిన వెంటనే ముంబయిలోని బాస్టియన్ హోటల్ కు బయల్దేరింది ఈ జంట. పలువురు బాలీవుడ్ ప్రముఖులకు రిసెప్షన్ ఇచ్చింది. మూడేళ్లుగా ప్రేమించుకున్న సోనాక్షి-ఇక్బాల్ ఇప్పుడు భార్యాభర్తలుగా మారారు.