పవన్ కల్యాణ్ నంబర్ 212

కూటమికి మద్దతుగా నిలుస్తూ, ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ఉప-ముఖ్యమంత్రి హోదా ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాటు పలు శాఖల్ని కూడా కేటాయించారు. ఇప్పుడాయనకు సచివాలయంలో ఛాంబర్ కూడా కేటాయించారు.…

కూటమికి మద్దతుగా నిలుస్తూ, ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ఉప-ముఖ్యమంత్రి హోదా ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాటు పలు శాఖల్ని కూడా కేటాయించారు. ఇప్పుడాయనకు సచివాలయంలో ఛాంబర్ కూడా కేటాయించారు.

పవన్ కల్యాణ్ కోసం సచివాలయంలోని రెండో బ్లాకు మొదటి అంతస్తులో గది కేటాయించారు. దాని నంబర్ 212. ఇకపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఈ గదిలోనే అందరికీ అందుబాటులో ఉంటారు. తన సమీక్షల్ని ఈ గది నుంచే ఆయన నిర్వహించబోతున్నారు.

అందరు మంత్రుల ఛాంబర్స్ లానే పవన్ కల్యాణ్ చాంబర్ ను కూడా రెడీ చేశారు. లోపలకు వెళ్లగానే 4 సోఫాలు వేశారు. ఆ తర్వాత ఓ 15 మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీలు ఏర్పాటుచేశారు. దాని ఎదురుగా పవన్ కోసం ఓ టేబుల్, కుర్చీ పెట్టారు.

ఛాంబర్ బయట కూడా వెయిట్ చేయడానికి మరికొన్ని కుర్చీలు ఏర్పాటుచేశారు. ప్రస్తుతం పవన్ ఛాంబర్ కు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే అంతస్తులో నాదెండ్ల, కందుల దుర్గేష్ ఛాంబర్స్ కూడా ఉన్నాయి.

బాధ్యతల స్వీకరణకు ముహూర్తం.. ముహూర్తం చూసి ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్, మంత్రిగా ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. దీనికి కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ మేరకు జనసేన నుంచి అధికార ప్రకటన వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బుధవారం నాడు పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ కు కేటాయించిన సంగతి తెలిసిందే. పవన్ ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ శాఖలున్నాయంట. అందుకే వీటిని తీసుకున్నారట.