ఆ సినిమా కథ పక్కన పెట్టారు

బలగం సినిమాతో మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు జబర్దస్త్ వేణు. ఆ తరువాత మాంచి కథ తయారుచేసుకుని, పెద్ద సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. దిల్ రాజు ఆస్ధానంలో వుండి హీరో కోసం చూస్తున్నాడు.…

బలగం సినిమాతో మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు జబర్దస్త్ వేణు. ఆ తరువాత మాంచి కథ తయారుచేసుకుని, పెద్ద సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. దిల్ రాజు ఆస్ధానంలో వుండి హీరో కోసం చూస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో బలగం సినిమా చూసి, వేణుతో సినిమా చేయాలని హీరో నాని సరదా పడ్డాడు. వేణు కథ చెప్పాడు. దాదాపు ఓకె అయింది. నానితో సినిమా చేయాలని నిర్మాత దిల్ రాజు కూడా చాలా సరదా పడ్డారు.

సరిపోదా శనివారం సినిమా తరువాత బలగం వేణుతో సినిమా చేయాలా? దసరా దర్శకుడు శ్రీకాంత్ తో సినిమా చేయాలా అన్నది డిస్కషన్లు సాగి, ముందుగా దసరా డైరక్టర్ వైపే మొగ్గాడు. అంత వరకు బాగానే వుంది. కానీ ఆ తురవాత బలగం వేణు సినిమా వుంటుందా? అంటే అది డవుట్ గానే వుంది.

ఎందుకంటే బలగం వేణు చెప్పిన కథకు, దసరా దర్శకుడు శ్రీకాంత్ చెప్పిన కథకు అక్కడక్కడ పోలికలు వుండడమే సమస్య అయింది. దాంతో బలగం వేణు పెట్టుకున్న కథ మరి ఇక నాని తీసుకోరు. మరో కథ ఏదైనా కనుక సెట్ చేస్తే, అప్పుడు మాత్రం సినిమా చేస్తారు.

ఆగస్టు తరువాత నుంచి దసరా డైరక్టర్ తో సినిమా వుంటుంది. ఈ లోగా మంచి కథ, దర్శకుడు దొరికితే మరో సినిమా చేసే ఆలోచన కూడా నాని చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నెల 20న అమెరికా వెళ్లి నెల రోజుల తరువాత నాని ఇండియా వస్తారు. అప్పుడు ఏ సినిమా మొదలుపెడతారు అన్నది క్లారిటీ వస్తుంది.