నేను సీతయ్యని.. సింపుల్ గా తేల్చేసిన చౌదరి

ఓ నటవారసుడ్ని తెరకు పరిచయం చేయాలంటే తెరవెనక చాలా ప్రహసనం ఉంటుంది. పెద్దల ఆశీస్సులతో పాటు, కథ విషయంలో వాళ్ల సూచనలు-సలహాలు తీసుకోవాలి. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ తనయుడు నందమూరి తారకరామారావును హీరోగా…

ఓ నటవారసుడ్ని తెరకు పరిచయం చేయాలంటే తెరవెనక చాలా ప్రహసనం ఉంటుంది. పెద్దల ఆశీస్సులతో పాటు, కథ విషయంలో వాళ్ల సూచనలు-సలహాలు తీసుకోవాలి. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ తనయుడు నందమూరి తారకరామారావును హీరోగా పరిచయం చేస్తున్నప్పుడు ఇంకెంత జాగ్రత్తలు తీసుకోవాలి?

బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.. ఇలా చాలామంది హీరోలున్నారు. మరి వాళ్లందరికీ దర్శక-నిర్మాత వైవీఎస్ చౌదరి కథ వినిపించారా..? ఈ ప్రశ్నకు చౌదరి సింపుల్ గా సమాధానమిచ్చారు. ‘నేను సీతయ్య’ని అనేది ఆయన ఆన్సర్. సీతయ్య ఎవ్వరి మాట వినడనే సంగతి అందరికీ తెలిసిందే. దాన్నే వైసీవీఎస్ చౌదరి పరోక్షంగా వెల్లడించారు. అంటే, నందమూరి హీరోలకు ఆయన కథ చెప్పలేదని అర్థం.

“ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, బాలకృష్ణ.. వీళ్లందరి ఆమోదంతోనే ఈ కొత్త ఎన్టీఆర్ పరిచయమౌతున్నాడు. ఒకరికి తెలియకుండా ఇంకొకరి ఆమోదంతో ఈ సినిమా చేయడం లేదు. నందమూరి కుటుంబంలోని అందరి ఆమోదం ఈ సినిమాకుంది. ప్రతి దర్శకుడు వెళ్లి కుటుంబంలో పెద్దలకు సబ్జెక్టులు చెప్పరు. వాళ్ల ఆశీస్సులు మా హీరోకు ఉన్నాయి.”
 
ఒక దశలో ఓ జర్నలిస్ట్ పై వైవీఎస్ చౌదరి సీరియర్ అయ్యారు కూడా. నందమూరి కుటుంబ సభ్యులంతా తన మంచి కోరుకుంటారని మాత్రమే అన్నారు. సినిమాలో ఎవర్ని పెట్టుకోవాలి, ఏ టెక్నీషియన్ ను తీసుకోవాలి లాంటి విషయాల్ని పెద్దలు అడగరని, మేకర్స్ కు పూర్తి స్వేచ్ఛనిస్తారని అన్నారు.

“సినిమా చేసేవాడికి కథ తెలుసా తెలియదా అని అడగడం వరకే మీ పని. సినిమా చేసే వాడికి కథ తెలుసు. అంతకుమించి ఉత్సుకత ఏంటి మీకు? వాళ్ల కుటుంబంలో ఉన్న అందరికీ కథ తెలుసా అని మీరు అడుగుతున్నారు. అలా తెలియాల్సిన అవసరం ఏముందని నేను అడుగుతున్నాను.”

ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులు తీసుకొని వస్తున్నానని, ఆయన ఆశీస్సులుంటే చాలని ప్రత్యేకంగా అతిథులు అవసరం లేదని అన్నారు వైవీఎస్. పైగా ఇది ఇది సినిమా ప్రకటన మాత్రమేనని, సంస్థ, హీరో పేరు ప్రకటించే కార్యక్రమం కాబట్టి, నందమూరి హీరోల్ని ఆహ్వానించలేదన్నారు.