శ్రీలల పేరు మారుమోగిపోతోంది!

ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీలీల పేరు మోగిపోతోంది. ఆమె తాజాగా హిట్ సినిమా ఇవ్వలేదు, అలా అని ఆమె నుంచి హాట్ ఫొటో షూట్ కూడా రాలేదు. అయినప్పటికీ ఆమె పేరు తెరపైకి రావడానికి…

ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీలీల పేరు మోగిపోతోంది. ఆమె తాజాగా హిట్ సినిమా ఇవ్వలేదు, అలా అని ఆమె నుంచి హాట్ ఫొటో షూట్ కూడా రాలేదు. అయినప్పటికీ ఆమె పేరు తెరపైకి రావడానికి కారణం, ఆమె బాలీవుడ్ డెబ్యూ ఇస్తోందనే ప్రచారమే.

అవును.. బాలీవుడ్ పై కన్నేసిందంట శ్రీలీల. ప్రస్తుతం ఓ సినిమాకు సైన్ చేసే ఆలోచనలో ఉంది. అది కూడా అలాంటిలాంటి సినిమా కాదు. సైఫ్ అలీఖాన్ కొడుకు సినిమా.

సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ ఆల్రెడీ బాలీవుడ్ లో ఉన్నాడు. కరణ్ జోహార్ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తూ, కెరీర్ స్టార్ట్ చేసిన ఈ నటవారసుడు, తాజాగా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఓ సినిమా పూర్తిచేశాడు. త్వరలోనే కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో హీరోయిన్ గా శ్రీలీలను తీసుకున్నారట.

సౌత్ లో శ్రీలీల కెరీర్ ఏమంత సాఫీగా సాగడం లేదు. ఒకప్పుడు రోజుకు 15 గంటలు నాన్-స్టాప్ గా వర్క్ చేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. దీనికి కారణం వరుసగా వచ్చిన ఫ్లాప్స్. భగవంత్ కేసరి మినహా ఆమె ఖాతాలో ఒక్క సక్సెస్ లేదు. తాజాగా వచ్చిన గుంటూరుకారం సినిమా, ఆమె కెరీర్ ను మరింత దెబ్బ తీసింది.

ఇలాంటి టైమ్ లో బాలీవుడ్ ఆఫర్ రావడం, పైగా సైఫ్ అలీఖాన్ కొడుకు సినిమా కావడం నిజంగా లక్కీనే. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఏదీ రాలేదు. తెలుగులో పవన్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తోంది శ్రీలీల. సాధారణంగా సౌత్ లో సూపర్ గా క్లిక్ అయిన హీరోయిన్లకు మాత్రమే, బాలీవుడ్ లో అవకాశాలు వస్తుంటాయి. శ్రీలీలకు ఛాన్స్ వచ్చిందంటే  కూసింత ఆశ్చర్యంగానే ఉంది.