టీ తాగుతూ రిజల్ట్స్ చూడొచ్చు !

ఎన్నికల ఫలితాల ఫీవర్ తో ఏపీ అంతా ఉంది. విశాఖ కూడా అందుకు అతీతం కాదు. ఈసారి సాగిన అతి పెద్ద రాజకీయ యుద్ధంలో ప్రజలు ప్రేక్షక పాత్ర నుంచి క్రియాశీల పాత్రకు టర్న్…

ఎన్నికల ఫలితాల ఫీవర్ తో ఏపీ అంతా ఉంది. విశాఖ కూడా అందుకు అతీతం కాదు. ఈసారి సాగిన అతి పెద్ద రాజకీయ యుద్ధంలో ప్రజలు ప్రేక్షక పాత్ర నుంచి క్రియాశీల పాత్రకు టర్న్ అయ్యారు. తాము వేసిన ఓటు ఎవరు జాతకాన్ని మారుతుంది అన్న ఉత్కంఠ సాధారణ జనాలలో సైతం ఉంది. జనాలలో ఉన్న ఉత్సాహాన్ని ఆసక్తిని సొమ్ము చేసుకునేందుకు బిజినెస్ వర్గాలు రకరకాలైన ఆకర్షణలకు తెర తీస్తున్నాయి.

విశాఖలోని ఒక హొటల్ లో వీక్షకుల కోసం సకల సదుపాయాలూ కల్పించారు. అక్కడ హాయిగా టీ తాగుతూ అతి పెద్ద టీవీ స్క్రీన్ మీద ఫలితాలను చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు అని నిర్వాహకులు ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. మంగళవారు ఉదయం ఎనింది గంటల నుంచి సాయంత్రం వరకూ జనాలు వచ్చి అక్కడ రిజల్ట్స్ ని చూస్తూ గడపవచ్చు అని వారు పేర్కొన్నారు.

వైసీపీ ఆఫీసులో బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసి ఎన్నికల ఫలితాలను వీక్షించేందుకు పార్టీ జనాలతో పాటు అభిమానులకు కూడా ఆహ్వానం పలికారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఇదే రకమైన ఏర్పాట్లు చేశారు. ఈసారి ఎన్నికల సంఘం బోలెడు ఆంక్షలు విధించడంతో కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. దాంతో ఎవరికి వారుగా ఇంట్లో ఉండి రిజల్ట్స్ ని చూస్తే ఏముంది మజా అనుకునేవారి కోసమే ఈ ఏర్పాట్లు అని అంటున్నారు.