పచ్చమీడియాకు దన్నుగా పోటెత్తుతున్న పచ్చనేతలు!

రోము నగరం తగలబడుతోంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి కంటే వాళ్ళు గొప్ప వాళ్ళు. గుడిసె తగలబడుతుంటే చుట్టకు నిప్పు అంటించుకునే బాపతు అంటే వాళ్లకు పోలిక సరిగ్గా సరిపోతుంది. Advertisement పోలింగ్ అనంతరం…

రోము నగరం తగలబడుతోంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి కంటే వాళ్ళు గొప్ప వాళ్ళు. గుడిసె తగలబడుతుంటే చుట్టకు నిప్పు అంటించుకునే బాపతు అంటే వాళ్లకు పోలిక సరిగ్గా సరిపోతుంది.

పోలింగ్ అనంతరం రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు అల్లర్లు ఘర్షణలు చెలరేగుతూ ఉంటే.. ఆ సమయంలో కూడా తాము కొమ్ముకాస్తున్న పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారాలను కొనసాగించిన మీడియా సంస్థలు వారు. జరిగిన సంఘటనను వక్రీకరించి, లేదా చిలవలు పలవలుగా పెంచి చూపించి సమాజంలో వాతావరణం దెబ్బతినేలా రెచ్చగొట్టే వార్తలు ప్రసారం చేయడం వాళ్లకు చాలా ఇష్టం. కానీ అలాంటి దుర్మార్గపు పనిచేసినందుకు పోలీసులు నోటీసులు ఇస్తే మాత్రం పచ్చదళాలన్నీ పిచ్చెక్కిపోతున్నాయి.

విశాఖపట్నం ఘర్షణలకు సంబంధించిన తప్పుడు, ప్రేరేపిత వార్తాకథనాల ప్రసారానికి సంబంధించి పోలీసులు ఈటీవీ, ఆంధ్రజ్యోతి ఏబీఎన్ ఛానల్ లకు నోటీసులు ఇచ్చారు. అక్కడికి ఏదో మీడియా పట్ల మహాపరాధం జరిగిపోయినట్లుగా వారికి దన్నుగా నిలబడడానికి తెలుగుదేశం జనసేన నాయకులు ఎగబడుతున్నారు.

బాధితుల వేదనను ప్రసారం చేయడం కూడా తప్పేనా? బాధితులు చెప్పిందే మీడియా చూపించింది కదా.. మీడియా ప్రతినిధులను భయపెట్టేలా చర్యలు తీసుకోవడం ఎలా అర్థం చేసుకోవాలి అని జనసేన పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు తెలుగుదేశం తరఫున దేవినేని ఉమాకు కూడా ఇదే ఆవేదన ఉంది. బాధితులు గొంతును వినిపించినందుకు కూడా కేసులు పెడతారా పోలీసు వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు.. అంటూ దేవినేని ఉమా రెచ్చిపోతున్నారు. మీడియా మీద కేసులు పెట్టాలంటే ఏ ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టాలి అనేది కూడా దేవినేని ఉమా నే చెబుతున్నారు.

పచ్చ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రజ్యోతి తమలోని అనల్పమైన చంద్ర భక్తిని చాటుకుంటూ ఉంటే.. ఆ మీడియా సంస్థల పట్ల తమలోని అనంతమైన కృతజ్ఞతా భావాన్ని తెలుగుదేశం జనసేన నాయకులు చూపించుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా పోలింగ్ నాడు, పోలింగ్ అనంతరం ఈసారి హింస చెలరేగింది.

జైల్లో హింసాత్మక సంఘటనలు జరగడానికి మీడియా దుష్ప్రచారం ఒక కారణం అని కూడా ప్రజలు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయడానికి కుట్రపూరితమైన ప్రచారానికి పూనుకున్న పచ్చ మీడియా శాంతి భద్రతల పరిస్థితిని విస్మరించడం దారుణం అని అభిప్రాయపడుతున్నారు.