ప్రభాస్ సినిమాలు పబ్లిసిటీలో వీక్. ఇది చిరకాలంగా ఫ్యాన్స్ నుంచి వున్న కంప్లయింట్. బ్యానర్ ఏదైనా అప్ డేట్ లు వుండవు. ప్రోపర్ ప్లానింగ్ వుండదు. కానీ ప్రాజెక్ట్ కల్కి అలా కాదు. మంచి బ్యానర్. మంచి దర్ళకుడు. మంచి సబ్జెక్ట్. అందువల్ల ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీరుస్తుంది అన్న ఆశ వుంది ఫ్యాన్స్ కు. కానీ ఆ సినిమా కూడా మందు వెనుక అవుతోంది. అప్ డేట్ లు మిస్ అవుతున్నాయి.
ఇలాంటి టైమ్ లో ‘మన జీవితంలోకి వచ్చేవారి గురించి చెబుతా’ అనే మీనింగ్ వచ్చేలా ప్రభాస్ ఓ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ పెట్టాడు. అంతే ఎద్దు ఈనింది అంటే దూడను కట్టేయండి అనే చందంగా అందరూ ఇక ప్రభాస్ కు పెళ్లి చేయడం మొదలుపెట్టేసారు.
ప్రభాస్ తన పెళ్లిని ఇలా ఇన్ స్టా లో ఎందుకు అనౌన్స్ చేస్తాడు అన్న ఆలోచన చేయలేదు. ప్రభాస్ పెళ్లి అంటే కుటుంబం వైపు నుంచి చాలా వుంటుంది. సంప్రదాయాలు, పద్దతులు చాలా వుంటాయి. అవన్నీ చూసినపుడు అనౌన్స్ మెంట్ ఇలా రమ్మన్నా రాదు.
కల్కి సినిమా హీరోయిన్ క్యారెక్టర్ ను ఇప్పటి వరకు పరిచయం చేయలేదు. ఇప్పుడు దాని కోసమే ఈ ఇన్ స్టా పోస్ట్ అని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఈ విషయం బ్రేక్ అయిన తరువాత జనాలు నాలుక్కరుచుకుంటారు. కల్కి సినిమా విడుదల డేట్ ఇచ్చేసారు. కానీ వరల్డ్ కప్ మ్యాచ్ వుంది కనుక అనుకున్న డేట్ కే రావాలా? మార్చాలా? అన్న మల్లగుల్లాలు జరుగుతున్నాయి. ఈలోగా పబ్లిసిటీకి షురూ చేయాల్సి వుంది. అందులో భాగంగానే ఈ ఇన్ స్టా పోస్ట్ అని తెలుస్తోంది
ఏం సంగతి బయటకు వచ్చాక ఫుల్ క్లారిటీ వస్తుంది.