ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు వెల్లడి కాకున్నా, ఎలా వుండబోతోంది ట్రెండ్ అన్నది చూచాయిగా తెలుస్తోంది. ఇప్పటి వరకు రాజకీయాల్లో బిజీగా వున్న పవన్ కళ్యాణ్ తన సినిమాలను ఏం చేయబోతున్నారు అన్నది ఫ్రశ్న. ఇప్పుడు పవన్ కు వున్న ఇమేజ్ అంతా సినిమాల ద్వారా వచ్చిందే. అందులో సందేహం లేదు. తన ఫ్యాన్స్ కోసం అయినా పవన్ తన సినిమాలను కొనసాగించాల్సి వుంటుంది.
ప్రస్తుతం ఆయన ఆరంభించి అలా ఆపిన సినిమాలు మూడు వున్నాయి. అందులో రెండు సినిమాలు రెండేసి భాగాలు. క్రిష్ తప్పుకున్న హరిహర వీరమల్లు సినిమా రెండు భాగాలు. కనీసం మొదటి భాగం అయినా పూర్తి చేయాలి. దానయ్య నిర్మించే ఓజి సినిమా రెండు భాగాలు అని టాక్ వుంది. మొదటి భాగం విడుదల డేట్ కూడా ప్రకటించారు. పవన్ ఒక్క పది రోజులు వర్క్ చేస్తే ఆ సినిమా పూర్తయిపోతుంది. మైత్రీ నిర్మించే ఉస్తాద్ సినిమా వుండనే వుంది.
ఈ మూడు కాక కొత్త కమిట్ మెంట్లు కూడా వుండొచ్చని వినిపిస్తోంది. అయితే వీటన్నింటికి పవన్ ఎప్పటి నుంచి టైమ్ కేటాయిస్తారు. జూన్ తొలివారంలో ఫలితాలు. ఆ తరువాత అధికారం అందితే ప్రమాణ స్వీకారం. హోమ్ మంత్రి అవుతారు పవన్ అనే టాక్ వుంది. అది చాలా పెద్ద బాధ్యత అవుతుంది. అవన్నీ వుంచుకుని సినిమాలు చేయడం అంత సులువు కాదు.
అందువల్ల పవన్ సినిమాల విషయంలో క్లారిటీ వచ్చేది జూన్ ఆఖరి వారం దగ్గర చేసి. అందువల్ల ముందుగా అనుకున్న డేట్ కు ఓజి సినిమా వస్తుందా అన్నది అనుమానమే. పవన్ సినిమాలు వదిలేస్తే మాత్రం ఫ్యాన్స్ చాలా అంటే చాలా డీలా పడిపోతారు.