పోలవరంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్వేతపత్రం విడుదల చేసి, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై ఎప్పట్లాగే తీవ్ర విమర్శలు చేశారు. కాంట్రాక్టర్లను మార్చడం వల్లే పోలవరం నిర్మాణం ఆగిపోయిందని, ఇప్పుడు దాని భవిష్యత్ ఏంటో చెప్పలేని పరిస్థితిలో వుందంటూ చంద్రబాబు తన మార్క్ విమర్శలు చేశారు. పోలవరానికి సంబంధించి క్రెడిట్ ఏదైనా వుందంటే తాను తీసుకుని, తప్పుల్ని మాత్రం వైఎస్సార్, ఆయన తనయుడు జగన్ పాలనలపై వేయడం చంద్రబాబు శ్వేతపత్రం విడుదలలోని ప్రత్యేకతగా చెప్పొచ్చు.
చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత, జలవనరులశాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా ముందుకొచ్చారు. పోలవరం నిర్మాణం ప్రశ్నార్థకం కావడానికి చంద్రబాబే కారణమని ఎప్పట్లాగే ఆయన విమర్శలు చేశారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణ బాధ్యతల్ని తాను తీసుకుని అతిపెద్ద తప్పు చేశారని బాబుపై విమర్శలు గుప్పించారు. బాబు శ్వేత పత్రం విడుదల సందర్భంగా పచ్చి అబద్ధాలు చెప్పారని ఆయన మండిపడ్డారు.
అయితే చంద్రబాబుకు పోలవరంపై అంబటి రాంబాబు బదులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చి వుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి పోలవరం విషయంలో చంద్రబాబును ఎండగట్టేందుకు జగన్‌కు ఇది మంచి అవకాశమని చాలా మంది అంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కనీసం ఈ దశలో అయినా వుందంటే దానికి కారణం దివంగత వైఎస్సార్ మాత్రమే అని అందరికీ తెలిసిన సత్యం. దీన్ని జగన్ సద్వినియోగం చేసుకోడానికైనా జగన్ మీడియా ముందుకు రావాల్సిన అవసరం వుందనే వాళ్లే ఎక్కువ.
పోలవరం నిర్మాణంలో చంద్రబాబు చెప్పిందేంటి? అందులో నిజానిజాల గురించి జగన్ పౌర సమాజానికి వివరించాల్సిన అవసరం ఎంతైనా వుంది. బాబుకు కౌంటర్ ఇచ్చేందుకు మీడియా ముందుకు రావాలని ఇప్పటికే కొందరు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. పోలవరంపై జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుందని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. బాబుకు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చినప్పటికీ, తగినంతగా ఆకట్టుకోదని సాగునీటి నిపుణులు అంటున్నారు.
ఎవరు బాబు ఈ కొత్త సైట్ కి టెస్టింగ్ చేసింది…
appatlo ante antha govt daggara dobbesina money undedi perfect ga chesevallu ippudu karchu endukani ee enki reddy gaade chesukuntunnademo
డయాఫ్రమ్ వాల్ డిజైన్ పనికి రాలేదు అని తెలిసింది కదా ఇప్పుడు. మొన్న వరదల్లో జరిగింది మల్లి జరగదు అని గ్యారంటీ లేదు, అందునా అన్ని అడుగుల ఎత్తులో రాక్ ఫిల్ డాం కట్టినప్పుడు, కింద వున్నా ఇసుక ఒక ఫ్లూయిడ్ లా డయాఫ్రమ్ వాల్ ని విరగ్గొట్టే ఛాన్స్ వుంది. ఇదే కాళేశ్వరం లో కూడా జరిగింది. దీనిని మల్లి రీడిజైన్ చెయ్యాల్సిన అవసరం కనిపిస్తుంది. సాండ్ బెడ్ కింద్ వున్నా రాక్ లో ఫౌండేషన్ వేసేలా కట్టాలి, అందుకోసం ఎన్ని సీజన్లో అయినా వెయిట్ చెయ్యాలి. ఎదో ఎలక్షన్స్ కోసమో, లేక పేరు కోసమో తొండాట పడకుండా ఉంటే మంచిది.
డయాఫ్రమ్ వాల్ డిజైన్ పనికి రాలేదు అని తెలిసింది కదా ఇప్పుడు. మొన్న వరదల్లో జరిగింది మల్లి జరగదు అని గ్యారంటీ లేదు, అందునా అన్ని అడుగుల ఎత్తులో రాక్ ఫిల్ డాం కట్టినప్పుడు, కింద వున్నా ఇసుక ఒక ఫ్లూయిడ్ లా డయాఫ్రమ్ వాల్ ని విరగ్గొట్టే ఛాన్స్ వుంది. ఇదే కాళేశ్వరం లో కూడా జరిగింది. దీనిని మల్లి రీడిజైన్ చెయ్యాల్సిన అవసరం కనిపిస్తుంది. సాండ్ బెడ్ కింద్ వున్నా రాక్ లో ఫౌండేషన్ వేసేలా కట్టాలి, అందుకోసం ఎన్ని సీజన్లో అయినా వెయిట్ చెయ్యాలి. ఎదో ఎలక్షన్స్ కోసమో, లేక పేరు కోసమో తొండాట పడకుండా ఉంటే మంచిది.
In the last 5 years, was the govt ever transparent on what was done on Polavaram. It was always kept as a secret.
Just to full fill his ego he reversed the progress of a project and you want more transparent details. Could Jagan/YCP in the last 5 years present where the TDP was at fault with Polavaram?
It took less than a month to get a visibility of damage done by Jagan.
6k per sqyd at shadnager near RRR KONDURG
For below details 6303134248
పోలవరమా.
దాన్ని ఎప్పుడో 2021 Dec లోనే కంప్లీట్ చేసి జాతికి అంకితం ఇచ్చాను కదా..
అదే నీళ్లు tanker లో తీసుకెళ్లి రాయలసీమ కి ఇస్తే ఆ నీళ్ళ లో కుప్పం కొట్టుకుపోయింది కదా??
ఈ చంద్రబాబు ఏంది.. ఇంకా 2020 లో వున్నట్టు మాట్లాడుతూ న్నాడు..
2024 election results నీ రివర్స్ టెండring చేస్తా..