తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వివాదాస్పద రిజర్వేషన్ల అంశంపై ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దివ్యాంగులకు ఐఏఎస్ లాంటి అత్యున్నత పోస్టుల్లో నియామకానికి రిజర్వేషన్ ఎందుకని ఆమె ప్రశ్నించారు. క్షేత్రస్థాయి పర్యటనలకు ఐఏఎస్ అధికారులు వెళ్లాల్సి వుంటుందని ఆమె పేర్కొన్నడం వివాదాస్పదమైంది.
దివ్యాంగులను కించపరిచేలా స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారని, ఆమె క్షమాపణ చెప్పాలనే డిమాండ్స్ వెల్లువెత్తాయి. ప్రముఖ మోటివేటర్, సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు బాలలత మీడియాతో మాట్లాడుతూ ఫీల్డ్‌లో పరిగెత్తుతూ స్మితా ఎంతకాలం పని చేశారో చెప్పాలని నిలదీశారు.
అసలే వివక్షకు గురవుతున్న వికలాంగులను స్మిత కామెంట్స్ మరింత కుంగదీశాయని వాపోయారు. మళ్లీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాయడానికి స్మితా సిద్ధమా? తనకంటే ఎక్కువ మార్కులు సాధిస్తుందేమో చూద్దామని ఆమె సవాల్ విసిరారు.
ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్ మరోసారి సోషల్ మీడియా వేదికగా మరోసారి స్పందించారు. బాలలత డిమాండ్‌పై ఆమె సెటైర్ విసిరారు. సివిల్ పరీక్షలు రాయడానికి తాను సిద్ధమని, కానీ వయసు పెరిగిన కారణంగా యూపీఎస్సీ అనుమతించదేమో అని బాలలతకు వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం.
ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్లకు సంబంధించి కూడా దివ్యాంగుల రిజర్వేషన్ వర్తింపజేసేలా పోరాడాలని బాలలత లాంటి వారికి స్మితా సూచించిన సంగతి తెలిసిందే. స్మితా సబర్వాల్ ధోరణిపై తెలంగాణ ప్రభుత్వ పెద్దలు బహిరంగంగా మాట్లాడేందుకు సిద్ధపడడం లేదు.
గూటిలోని చిలక మాటలు వినే వాళ్లకు ముచ్చట గా ఉంటాయి. కొండ కోనల్లో తిరిగే కోయిలమ్మ పాట అంత కంటే మైమరపిస్తుంది. కోయిల కష్టం గుర్తించడం అసాధ్యం. చిలక గూడు దాటితే ఆ పలుకులను ఎవరూ వినరు..అమ్మా స్మితమ్మ మీరు ఫీల్డ్‌లోకి వెళ్లాలంటే హెలికాప్టర్ కావాలి.పాపం గ్రామీణ భారతంలో స్వయంశక్తితో ఎంపికైన అధికారుల కష్టాలు ఎప్పుడైనా విన్నారా? ..మీరు స్వయంగా,ఒంటరిగా గ్రామాల్లోకి వెళ్లి పిల్లల చదువు కష్టం తెలుసుకుని మాట్లాడండి. మన దేశ పౌరురాలిగా మీరు బాధ్యతగా వ్యవహరించండి..
స్మిత గారు దివ్యాంగులకి కోట ఇవ్వడం వ్యతిరేకమా? లేక దివ్యాంగులకీ ఉద్యోగం ఇవ్వదానికే వ్యతిరేకమా??? Okavela divyaagulu open category lo job తెచుకుంటే?? purushulu sharirakamgaa drudam gaa vuntaaru kaabatti IAS IPS కేవలం పురుషులకే ఇవ్వాలంటే???
divyangulaki kota ivvataaniki
Asalu reservations undalsildini handicapped and lower poverty Vallari..inkaa enthakalam Ambedkar di follow avutharu..that should be revised
పవన్ కల్యాణ్ దివ్యాంగులకు అండఖగా ఉంటాను అని మొహం చాటేస్తున్నాడు
దీనికి ఆక్సిడెంట్ లో ఒక కాలో చెయ్యో పోయిందంటే చచ్చి పొద్దేమో ఈ బ్రతుకు వేస్ట్ అని